Kajal Aggarwal: స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది

Updated on: Dec 24, 2025 | 9:01 AM

కాజల్ అగర్వాల్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, దేవాలయాల ధ్వంసంపై తీవ్రంగా స్పందించారు. కేవలం సినిమా ప్రమోషన్లకు పరిమితం కాకుండా, రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మనుషులపై హింస అమానుషమని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తన ఫ్యామిలీతో వెకేషన్లు.. లేదంటే సినిమా కబుర్లు.. మరీ కాదంటే తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటో షూట్లు! ఇందుకు మాత్రమే ఎక్కువగా తన సోషల్ హ్యాండిల్స్‌ను ఉపయోగించే కాజల్ అగర్వాల్.. తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందూ సమాజం ఎదుర్కొంటున్న హింసపై తీవ్రంగా స్పందించింది. అక్కడ దేవాలయాల ధ్వంసం, సామాన్య ప్రజలపై దాడులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే.. మనుషులపై ఇలాంటి దాడులు జరగడం అమానుషమని.. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించే హక్కు ఉందని.. బంగ్లాలో హిందువుల పై జరుగుతున్న దాడుల గురించి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది కాజల్. అయితే రాజకీయాలకు అతీతంగా కేవలం మానవత్వ ప్రాతిపదికన ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలపై సెలబ్రిటీలు మాట్లాడటానికి వెనకడుగు వేస్తుంటారు. ఎక్కడ వివాదాల్లో చిక్కుకుంటామో అని మౌనంగా ఉండిపోతారు. కానీ కాజల్​ మాత్రం ధైర్యంగా తన గొంతు వినిపించింది. “మన పొరుగు దేశంలో మన సోదర సోదరీమణులు పడుతున్న బాధను చూస్తూ ఊరుకోలేం. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి” అని ఆమె కోరింది. హింస లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని పిలుపునిచ్చింది. ఇక ఆమె చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. “నిజమైన స్టార్ అంటే ఇలాగే ఉండాలి.. కేవలం సినిమాల ప్రమోషన్లకే పరిమితం కాకుండా ఇలాంటి సామాజిక అంశాలపై స్పందించడం గర్వకారణం” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా ఆశ చూపినా… బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్

OG Sequel: చేతులు మారిన OG సీక్వెల్ ??

Thanuja: నాకో గుణపాఠం నేర్పారు.. వైరల్ అవుతున్న తనూజ