K.Viswanath last Video: కె.విశ్వనాథ్.. మరణానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలుసా..! వీడియో.

Updated on: Feb 09, 2023 | 9:13 PM

టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శక దిగ్గజాన్ని కోల్పోయింది. కళాతపస్వి కె. విశ్వనాథ్ శివైక్యం చెందారు. ఆయన మరణం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఎన్నో అద్భుతమైన

టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శక దిగ్గజాన్ని కోల్పోయింది. కళాతపస్వి కె. విశ్వనాథ్ శివైక్యం చెందారు. ఆయన మరణం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన కళాతపస్వీ ఫిబ్రవరి 2 రాత్రి 11 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమని చెప్పారట. ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారట.ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశారు. ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన దర్శకులు కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకుని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కళాతపస్విని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వచ్చారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‏లో ఆయన నివాసంలో విశ్వనాథ్‌ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..