కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్‌ చివరి లెటర్

Updated on: Jul 04, 2026 | 9:12 PM

ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ మరణానంతరం ఆయన రాసినట్లు ప్రచారంలో ఉన్న భావోద్వేగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్లను దానం చేయాలనే ఆకాంక్షతో పాటు తన కుమారుడు శాంతనుకు కూడా అభిమానులు ఇదే ప్రేమను అందించాలని అందులో కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లేఖ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తుండగా, అది ఆయనదేనని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ రీసెంట్‌గా గుండెపోటుతో చనిపోయారు. ఈయన రాసినట్లు చెబుతున్న ఓ లెటర్ ఆయన మరణానంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులని కన్నీళ్లు పెట్టిస్తోంది. మన చుట్టూ ఉన్నవాళ్లని సంతోషపెట్టడంలో నిజమైన ఆనందముంది. నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు, నన్ను ప్రోత్సహించిన తల్లులకు, ఇండస్ట్రీలోని సహచరులకు కృతజ్ఞతలు. మీ ప్రేమతో నిండిన చూపుల కోసం నా కళ్లని సజీవంగా ఉంచాను. దయచేసి వాటిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ రాసుకొచ్చారు. తన కోసం కొట్టిన చప్పట్లే తన కొడుకుకి కూడా ఆశీర్వాదంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. జీవితాంతం తనకు అందించిన ప్రేమ, ఆదరణ ఇకపై తన కొడుకు శాంతనుకు కూడా అందించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. తాను శారీరకంగా లేకపోయినప్పటికీ దానం చేసిన కళ్ల ద్వారా అభిమానులని చూస్తూనే ఉంటానని భాగ్యరాజ్‌ తన లేఖలో రాసుకొచ్చారు. ఈ శరీరం శాశ్వతం కాదు. ఒకరోజు భూమిలో కలిసిపోతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది. చివరకు మిగిలేది బూడిద కాదు. మనం పంచిన ప్రేమే అసలైన సంపద. నా జీవిత ప్రయాణంలో నన్ను ప్రేమించిన, నా కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రతీ ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. మంచి సినిమాలు, కథలు, డైలాగ్స్, మానవత్వం ద్వారా చిరస్థాయిగా జీవిస్తాను’ అంటూ తన చివరి లేఖలో నటుడు భాగ్యరాజ్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసభ్యకరంగా బ్యాక్‌ షాట్ తీసేందుకు కెమెరామెన్ ప్రయత్నం అరిచిన హీరోయిన్ !

Rahul Ravindran: పిల్లలను చంపేస్తామనే బెదిరింపులు.. ‘ఎక్స్‌’ నుంచి తప్పుకున్న డైరెక్టర్

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే.. వాటి జోలికి పోరు!

Follow Us