Jyothika: ఆ చెడ్డ అలవాటు మానకపోవడం వల్లే తరుచూ మా మధ్య గొడవ

Updated on: Feb 02, 2026 | 5:06 PM

సూర్య, జ్యోతికల 19 ఏళ్ల వైవాహిక బంధం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది. విడాకుల రూమర్లను తోసిరాజని, అన్యోన్యంగా జీవిస్తున్న ఈ జంట ఇటీవల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక తన భర్త సూర్య గురించి మనసు విప్పి మాట్లాడారు. ఆయన గౌరవం, స్నేహ స్వభావం ఇష్టమని, కానీ బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం తనకు నచ్చదని సరదాగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సూర్య, జ్యోతిక జోడీ జోడీ కూడా ఒకరు. పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా అన్యోన్యంగా ఉంటూ నేటి యూత్ కు రిలేషన్ షిప్ పాఠాలు నేర్పిస్తున్నారు. ఆ మధ్యన ఈ దంపతుల గురించి విడాకుల వార్తలు వచ్చినా అవి రూమర్లేనని తేలిపోయాయి. సూర్య – జ్యోతిక దంపతులకు దియా అనే కూతురు, దేవ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆలనా పాలనా చూసుకుంటూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది జ్యోతిక. అయితే చేతికొచ్చిన సినిమాలన్నీ కాకుండా స్టోరీ బేస్డ్ మూవీస్ నే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక సూర్య పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ముంబైలోనే కాపురముంటోన్న సూర్య, జ్యోతిక ఇటీవల తమ 19వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు మ్యారేజ్ యానివర్సీరీ విషెస్ తెలిపారు.ఈ నేపథ్యంలో సూర్య గురించి జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘నా భర్త సూర్య నాతో స్నేహంగా ఉంటారు. ప్రేమగా చూసుకుంటారు. నాకు చాలా గౌరవం కూడా ఇస్తారు. అది నాకు చాలా ఇష్టం. కానీ మా ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. అది మాత్రం నాకు అసలు నచ్చదు. ఆయన బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ అలవాటును మాత్రం నేను సహించలేను. దీనికోసం మేం తరచూ గొడవలు కూడా పడతాం’ అని జ్యోతిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: 2026లో కొడితే.. డబుల్ ధమాఖానే..

TOP 9 ET: మారుతీకి అండగా పెద్ద సంస్థతో సినిమా సెట్ చేసిన ప్రభాస్‌

నైజాం కింగ్‌ మెగాస్టారే.. అట్లుంటది మనోడితోని

Rajamouli: హ్యాష్ ట్యాగ్‌తో అడ్డంగా దొరికిన జక్కన్న

డైలాగ్స్‌ లేవు.. ఉత్త మూకీ సినిమా.. కానీ

Published on: Feb 02, 2026 05:05 PM
Loading...
Unable to load recommendations.
Follow Us