అడ్వాన్స్ బుకింగ్స్‏లో వార్ 2 ఆల్ టైమ్ రికార్డ్..

Updated on: Aug 12, 2025 | 5:09 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లీడ్‌ రోల్లో యాక్ట్ చేస్తున్న లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదల అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఆగస్ట్ 14 వైపు ఈగర్‌గా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 10 నుంచి వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభమవ్వడమే కాదు.. ఏకంగా నయా రికార్డ్‌నే సెట్ చేశాయి. వార్ 2 సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా సాధించని విజయాన్ని సాధించింది. బుక్ మై షో డాటా ప్రకారం 7,58,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నుంచి ఇంట్రెస్ట్ ఇంప్రెషన్‌ను దక్కించుకుంది వార్ 2 మూవీ. విడుదలకు నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో 750K మార్కును దాటటం రికార్డ్. బాలీవుడ్‌లోని చాలా పెద్ద సినిమాలు విడుదల వారానికి ముందు 500K ని మాత్రమే చేరుకుంటాయి. కానీ వార్ 2 మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తక్కువ టైంలోనూ ఇంత ఇంట్రెస్ట్ రేట్‌ను సాధించడం బుక్ మై షో లో నయా హిస్టరీలో మారింది. అది కాస్తా ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జపాన్‌ లోకల్ ట్రైన్‌లో NTR క్రేజ్‌.. అవాక్కవుతున్న ఇండియన్స్‌

మెట్రో రైల్‌ పై కూలీ పోస్టర్.. దెబ్బకు దడదడలాడించిన NTR ఫ్యాన్స్‌

వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి