Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. నిరంతర షూటింగ్ అలసట కారణంగా ఎన్టీఆర్ జలుబు, జ్వరంతో బాధపడటంతో డాక్టర్లు విశ్రాంతి సూచించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ జరుగుతుండగా, త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. 2026 జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఆఫ్టర్ వార్ 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ డ్రాగన్. ఈ టైటిల్ అఫీషియల్ కాకపోయినా.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ఈ టైటిలే ఫిక్స్ అయినట్టు మేకర్స్ మాటలను బట్టి తెలిసిపోయింది. అప్పటి నుంచి ఈ టైటిల్ అండ్.. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ విషయమూ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే మరో సారి ఈ మూవీకి బ్రేక్ పడినట్టుగా మరో టాక్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క అసలు విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ గత రెండు రోజుల నుంచి స్వల్పంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. నిరవధికగా షూటింగ్ లో పాల్గొనడం వల్ల అలసట కారణంగానే జ్వరం వచ్చినట్టుగా డాక్టర్స్ సూచించారట. కనీసం మూడు రోజుల విరామం అవసరం అని చెప్పారట. అందుకే, డ్రాగన్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడట ఎన్టీఆర్. దీంతో, ప్రస్తుతానికి డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగినట్టుగా తెలుస్తోంది. క ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. గత వారం రోజులుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే షూటింగ్ మళ్ళీ మొదలుకానుంది. 2026 జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది
మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు
Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో
Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లిపై రష్మిక నాటీ ఆన్సర్
గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్.. ఊపిరి పీల్చుకుంటున్న యంగ్ హీరోలు
