ముఖ్యమంత్రి పేరును మర్చిపోయా క్షమించండి..

Updated on: Aug 12, 2025 | 6:33 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ .. అన్నీ ఆకట్టుకున్నాయి.

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. తారక్ మాట్లాడిన మాటలు.. వార్ 2 కంటెంట్ పై ఇచ్చిన హింట్లు అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తారక్ ఇన సోషల్ మీడియా వేదికగా మరో వీడియోను షేర్ చేశారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పెషల్ థాంక్స్‌ చెప్పారు. స్టేజ్‌ పై ఆయన్న అడ్రస్ చేయనందుకు క్షమించమని కోరారు. సినిమా గురించి, అభిమానుల గురించి మాట్లాడుతూ ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం గురించి , పోలీసుల సహకారం గురించి మాట్లాడటం మర్చిపోయా.. క్షమించండి అంటూ తను షేర్ చేసిన వీడియోలో చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈవెంట్ లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. నా పాతిక సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నాడు ఎన్టీఆర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అభిమాని మూగ అభిమానం.. కరిగిపోయి కోరిక తీర్చిన NTR

అడ్వాన్స్ బుకింగ్స్‏లో వార్ 2 ఆల్ టైమ్ రికార్డ్..

జపాన్‌ లోకల్ ట్రైన్‌లో NTR క్రేజ్‌.. అవాక్కవుతున్న ఇండియన్స్‌

మెట్రో రైల్‌ పై కూలీ పోస్టర్.. దెబ్బకు దడదడలాడించిన NTR ఫ్యాన్స్‌

వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి