అభిమాని మూగ అభిమానం.. కరిగిపోయి కోరిక తీర్చిన NTR
మాటలే కాదు.. చేతల్లోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చూపిస్తుంటారు. అభిమానులపై... మాటల్లో ప్రేమను చూపించడమే కాదు.. చేతల్లోనూ ప్రేమను పదర్శిస్తుంటాడు. తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అదే చేశాడు. మాటలు రాకున్నా.. తనపై అమితమైన అభిమానాన్ని పెంచుకున్న తన అభిమానిని గుర్తించాడు.
పిలిచి మరీ.. తన కోరికను తీర్చాడు యంగ్ టైగర్. తన కోసం గుడివాడ నుంచి వచ్చిన ఓ అభిమానిని తారక్ స్పెషల్ గా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిశారు. మాటలు రాని ఆ అభిమానికి తారక్ అంటే ఎంతో ఇష్టం.. ఆయనను కలవడానికి చాలా సార్లు ప్రయతించిన కుదరలేదు.. దేవర సమయంలోనూ తారక్ ను కలవాలని ప్రయతించినా కుదరలేదు. ఇప్పుడు ఆ అభిమాని కల నిజమైంది. తారక్ ను కలిసి ఆయనతో ఫోటో దిగాడు ఆ ఫ్యాన్. అలాగే హృతిక్ రోషన్ తో కూడా ఫోటో దిగుతా అని ఆ అభిమాని అడగ్గా.. హృతిక్ తో తారక్ మాట్లాడి ఆ అభిమానికి ఫోటో ఇప్పించాడు.. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూనే.. అభిమానులపై తారక్ చూపించే ప్రేమకు ఇదో నిదర్శనంగా కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అడ్వాన్స్ బుకింగ్స్‌లో వార్ 2 ఆల్ టైమ్ రికార్డ్..
జపాన్ లోకల్ ట్రైన్‌లో NTR క్రేజ్.. అవాక్కవుతున్న ఇండియన్స్
మెట్రో రైల్ పై కూలీ పోస్టర్.. దెబ్బకు దడదడలాడించిన NTR ఫ్యాన్స్
వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి