Jr NTR: ‘నా గుండె కోస్తే మా బాబాయ్‌ బాలకృష్ణ కనిపిస్తారు’

|

Jun 26, 2024 | 2:57 PM

బాలకృష్ణ అంటే తారక్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు. తన బాబాయ్‌ గురించి చాలా గొప్పగా.. ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. తన మాటలతో అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. అలా గతంలో ఎన్టీఆర్ తన బాబాయ్‌ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు మరోసారి బయటికి వచ్చాయి. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

బాలకృష్ణ అంటే తారక్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుతుంటారు. తన బాబాయ్‌ గురించి చాలా గొప్పగా.. ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. తన మాటలతో అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటారు. అలా గతంలో ఎన్టీఆర్ తన బాబాయ్‌ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు మరోసారి బయటికి వచ్చాయి. నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అప్పట్లో అదుర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్‌ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఇక ఆ వేదిక పై బాలయ్యను చూసిన తారక్ చాలా ఎమోషనల్ అయ్యారు. ‘నా గుండె కోస్తే తాతగారు ఎన్టీఆర్ కనిపిస్తారని అందరూ అంటుంటారు.. కానీ నా గుండె కోస్తే మా బాబాయి కనిపిస్తారు’ అంటూ చాలా ఎమోషనల్‌గా చెప్పారు తారక్. అంతేక కాదు అప్పట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి వస్తూ.. యాక్సిండెట్‌కు గురైనా తను ఆ యాక్సిడెంట్ నుంచి క్షేమంగా బయటపడ్డానంటే.. అది తాతగారి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే తన బాబాయ్ ఆశీస్సుల వల్లే అంటూ చెప్పారు. తన కామెంట్స్‌తో అప్పట్లో ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో సారి అదే వీడియో క్లిప్‌ తో ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నారు తారక్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్ నటికి బెదిరింపు కాల్స్.. అసలు ఏమైందంటే ??

TOP 9 ET News: కల్కి ఊచకోత… ఇవేం రికార్డులురా బాబు.. | కోరిన కోర్కెలు నిజమైన వేళపవన్‌ కఠోర దీక్ష