రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో

Updated on: Dec 16, 2025 | 1:34 PM

హీరో ధర్మ మహేష్ తన జిస్మత్ మండీ రెస్టారెంట్ సామ్రాజ్యాన్ని గుంటూరుకు విస్తరించారు. ఇప్పటికే 17కు పైగా శాఖలు తెరిచిన ఆయన, తన కొడుకు పేరుపై బ్రాండ్‌ను జిస్మత్‌గా మార్చారు. గుంటూరులో జైలు థీమ్‌తో కొత్త శాఖను ప్రారంభించారు. 'J'తో పేరు మొదలయ్యే వారికి ఉచిత మినీ చికెన్ మండీ ఆఫర్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

తన జిస్మత్ రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా హైదరాబాదీలకు బిర్యానీ ఆఫర్ ఇచ్చిన హీరో ధర్మ ఇప్పుడు తన రెస్టారెంట్ బ్రాండ్‌ను గుంటూర్‌కు కూడా విస్తరించాడు. గుంటూరులో కూడా జిస్మత్ మందీ రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశాడు. ఈ మధ్య సెలబ్రిటీలందరూ ఫుడ్ బిజినెస్ లు మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ జిస్మత్ మండీ రెస్టారెంట్స్ ని మొదలుపెట్టాడు. తన భార్యతో ఉన్న వివాదంతో వైరల్ అయిన ఈయన ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ మీద ఫోకస్ పెట్టి తన రెస్టారెంట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాడు. ఇప్పటి వరకు 17కి పైగా రెస్టారెంట్స్‌ను ఓపెన్ చేశాడు. మొదట ధర్మ మహేష్ Gismat పేరుతో రెస్టారెంట్స్ ని మొదలు పెట్టాడు. ఇప్పుడా రెస్టారెంట్ పేరును తన కొడుకు జగద్వజ పేరు మీదకు మారుస్తూ రీ బ్రాండిగ్ చేశాడు. Jismat గా తన రెస్టారెంట్స్ అప్‌గ్రేడ్ చేశాడు. ఇటీవల అమీర్‌పేట్‌లో ఓ రెస్టారెంట్ ని ప్రారంభించగా .. ఈ తర్వాత చైతన్యపురిలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. ఈ సందర్భంగా తన రెస్టారెంట్ కి వచ్చేవాళ్లకు స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చాడు ఈ హీరో. తన కొడుకు జగద్వజ లాగే ఎవరి పేరు అయినా J తో స్టార్ట్ అయితే వాళ్లకు మినీ చికెన్ మండీ ఫ్రీగా ఇస్తానంటూ ధర్మ మహేష్ చెప్పాడు. ఆ ఆఫర్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇప్పుడీ హీరో గుంటూరులో కూడా తన జిస్మత్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. జైలు అండ్ అరబియన్‌ థీమ్‌తో తన మండిని స్టార్ చేశాడు. ఈ సందర్బంగా వెయ్యి మందికి పైగా ఈయన ఫ్యాన్స్‌ భారీ బైక్ ర్యాలీతో ఈ హీరో కు వెల్‌ కమ్ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండో పెళ్లీ పెటాకులేనా ?? పాపం.. ఆ డైరెక్టర్

Akhanda 2: థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న అఖండ 2.. 3rd Day ఎంత వసూల్ చేసిందంటే

Suman Shetty: బిగ్ బాస్ చరిత్రలోనే భారీ రెమ్యూనరేషన్ !! సుమన్ శెట్టికి భారీగా డబ్బులు