New OTT Releases: ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు..మరిన్ని ఇంట్రెస్టింగ్ OTT రిలీజ్ డీటైల్స్‌

Updated on: Jan 28, 2026 | 9:21 AM

ఈ వారం ఓటీటీల్లో అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. జనవరి చివరి వారంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ధురందర్, ఛాంపియన్, సర్వం మాయ, పతంగ్ వంటి కీలక చిత్రాలతో పాటు పలు భాషలకు చెందిన డబ్బింగ్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. మీ వీకెండ్ ప్లాన్‌కు ఇది సరైన గైడ్.

ఈ వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో మెయిన్‌ గా ధురందర్ , రోషన్ ఛాంపియన్, నివిన్ పౌలి సర్వం మాయ, పతంగ్ చిత్రాలపైనే అందరి ఫోకస్ ఉంది. ఇక వీటితో పాటు పలు భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అవేంటో.. ఒక్కో ఓటీటీ వారీగా చూస్తే..

నెట్‌ఫ్లిక్స్ లో..

మైక్ ఎప్స్: డెల్యూషనల్ – జనవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

‘టేక్ దట్’ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జనవరి 27 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

మరో ఇంగ్లీష్ వెబ్ సీరిస్‌ ‘బ్రిడ్జర్‌టన్ సీజన్ 4’ జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రోషన్ హీరోగా నటించిన తెలుగు మూవీ ‘ఛాంపియన్’ – జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక మోస్ట్ అవేటెడ్ ‘ధురంధర్’ తెలుగు డబ్బింగ్ సినిమా – జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవనున్నట్టు తెలుస్తోంది.

ఇంగ్లీష్ మూవీ ‘మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్’ – జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో..

‘ద రెకింగ్ క్రూ’ అనే ఇంగ్లిష్ సినిమా – జనవరి 28 నుంచి అందుబాటులో ఉంటుంది.

హిందీ వెబ్ సిరీస్ ‘దల్ దల్’– జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవనుంది.


ఇక జియో హాట్‌స్టార్లో…

హిందీ మూవీ ‘గుస్తాక్ ఇష్క్’ – జనవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక మోస్ట్ అవేటెడ్ తెలుగు డబ్బింగ్ ‘సర్వం మాయ’ సినిమా కూడా – జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

—-

ఇక సన్ నెక్స్ట్ లో..

చిన్న సినిమా వచ్చి.. అందర్నీ ఆకట్టుకున్న పతంగ్ తెలుగు సినిమా – జనవరి 30 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.

జీ5 ఓటీటీలో…

—-

మరాఠీ సిరీస్‌.. ‘దేవ్‌కెళ్’ – జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? రోడ్డు కోసం గుర్రాలపై వెళ్లి వినతి పత్రం

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

కూచిపూడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన నాట్యమయూరి

Published on: Jan 28, 2026 09:11 AM