Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శిఖర్ పహారియాపై తనకున్న అభిమానాన్ని భావోద్వేగంగా వెల్లడించింది. 2018లో తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత తాను ఎదుర్కొన్న కష్టకాలంలో శిఖర్ అండగా నిలిచాడని గుర్తుచేసుకుంది. అప్పట్లో లండన్‌లో చదువుకుంటున్న అతడు చదువుకు విరామం తీసుకుని తన కోసం ముంబైకి వచ్చాడని తెలిపింది. దాదాపు నెల రోజుల పాటు తనకు తోడుగా ఉన్నాడని చెబుతూ ఎమోషనల్ అయింది.
దేవర, పెద్ది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అటు సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన మనసులోని బాధను బయటపెట్టింది. తనకు శిఖర్ పహారియా ఎందుకు అంత ఇష్టమో చెబుతూ ఎమోషనల్ అయింది. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశలలో తన స్నేహితుడు శికర్ పహారియా తనకు అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. 2018లో తన తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత కాలాన్ని గుర్తుచేసుకుంటూ, తనకు తోడుగా ఉండేందుకు శిఖర్ లండన్‌లో తన చదువును వదిలేశాడని ఎమోషనల్ అయింది. శిఖ్‌ర్ లండన్‌లో చదువుకునేవాడు. అమ్మ చనిపోయారని తెలియగానే అతడు అర సెమిస్టర్ సెలవు తీసుకుని వచ్చాడు. నిజానికి అతడు తన తండ్రితో ఉండాలని అనుకున్నాడు. కానీ తన కోసం ముంబైలోని జుహులోని తన స్నేహితుడు ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఆ కష్ట సమయంలో తన కోసం దాదాపు నెల రోజులు అంటూ జాన్వీ ఎమోషనల్ అయ్యింది. శిఖర్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది జాన్వీ కపూర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్
ఒక్కో ఇన్విటేషన్ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?
Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!
నరకయాతన అంటే ఇదేనేమో.. త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు
కావ్య – అనిరుధ్ పెళ్లి వేడుకకు.. ఒకే ఒక్క టాలీవుడ్ హీరోకే పిలుపు ..
