ప్రేమలో మోసపోయాడు.. తాగుడుకు బానిసగా.. బతుకీడుస్తున్నాడు..! సన్నీ సాడ్ స్టోరీ
ప్రేమ ఎంతమధురం.. ప్రియురాలు అంత కఠినం.. అని ఆత్రేయ అప్పుడెప్పుడో చెప్పేశారు. ప్రేమలో విఫలమైతే.. అందులో.. మనం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మనల్ని వదిలేసి వెళితే.. ఆ వేదన భరించరానిదంటూ ఎన్నో పాటల్లోనూ చెప్పారు. అయితే అచ్చం ఆత్రేయ పాటల్లోని అక్షరాలకు రూపంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తన స్టోరీతో వైరల్ అవుతున్నాడు జబర్దస్త్ ఫేం సన్నీ.
తన కామెడీతో .. పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. సన్నీ ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది. ఆ విషాదమే అతన్ని తాగుడుకు బానిసను చేసింది. ప్రేమపై విరక్తి పెంచేసింది. పెళ్లికి దూరం చేసింది. జస్ట్ బతుకీడుస్తే చాలానే ఆలోచనను పుట్టించింది. జబర్దస్త్‌లో ఎప్పుడూ నవ్వులే కాకుండా.. అప్పుడప్పుడూ ఆ నవ్వుల వెనుకున్న కష్ట సుఖాలను కూడా గుచ్చి గుచ్చి మరీ అడిగే యాంకర్ రష్మీ.. ఓ సారి సన్నీని కూడా.. పెళ్లి గిల్లీ లేకుండా ఎందుకీ తాగుడు అంటూ అడిగేసింది. అంతే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సన్నీ.. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఓ అమ్మాయిని 8ఏళ్లుగా ప్రేమిస్తే… ఆమె తనను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చూసుకుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో కమెడియన్ రామ్ ప్రసాద్… సన్నీ మంచి కోటీశ్వరుడని.. బోలెడన్ని డబ్బులు కూడా ఉన్నాయని అసలు విషయం చెప్పాడు. కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను వదిలేసుకున్నాడన్నాడు. సన్నీ అన్న, వదిన ఇద్దరూ డాక్టర్స్.. అంత డబ్బున్నా వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు.. మా రూమ్స్ కు వచ్చి తాగి పడుకుంటాడు. అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేశాడంటూ చెప్పాడు. ఎంతైనా సన్నీ స్టోరీ సో సాడ్ కదా…!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్..
అలెర్ట్.. అలెర్ట్..! వారందరికీ దిల్ రాజు హెచ్చరిక
అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ వాళ్లకు దిమ్మతిరిగేలా చేశాడు