తన స్టైల్లో వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చిన హైపర్ ఆది

Updated on: Jul 25, 2025 | 11:55 AM

నాన్ స్టాప్ పంచులతో.. కబుపుబ్బ నవ్వించే ఆన్‌ స్టేజ్‌ తింగర పనులతో బుల్లితెరపై కామెడీ స్టార్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆది.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తాడు. రివ్యూవర్‌గా మారాడు. తాను అభిమానించే ... అమితంగా ఇష్టపడే పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా గురించి షార్ట్‌ గా... రివ్యూ ఇస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూశాను.

సినిమా చాలా బాగుందన్న హైపర్ ఆది.. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కు మీరు తెచ్చుకున్న పేపర్స్ అయిపోతయంటూ చెప్పాడు. సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్స్ చాలా చాలా ఉన్నాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్.. అందుకు కీరవాణి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయన్నాడు. ఆ హైతోనే మీరందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంతో సహా వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని, మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పాడు ఆది. అంతేకాదు వీరమల్లు షూటింగ్ టైంలో చాలాసార్లు సెట్స్ కు వెల్లానని.. అక్కడ ప్రతీ సీన్‌లో పవన్‌ తీసుకునే కేర్‌ను తాను చూశానని చెప్పాడు ఆది. అది రోజు స్క్రీన్ మీద కనిపించిందని.. క్లైమాక్స్ ప్రతి అభిమానిని కదిలించింది అంటూ తన స్టైల్లో హరి హర వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చాడు ఆది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘సూపర్ హిట్‌’ డిప్యూటీ సీఎం సినిమాపై.. సీఎం సాబ్‌ వైరల్ ట్వీట్‌!

మరీ ఇంత ఏడుపుగొట్టు సినిమానా ఇది! చూసిన వాళ్లందరూ పడీ పడీ ఏడుస్తున్నారుగా

ఆ గ్రామంలో చింత చెట్టే డాక్టర్! చెట్టు కాండం గుండా వెళితే రోగాలు మాయం!