చిరు, మహేష్ చేయాల్సిన సినిమాతో హిట్టు.. దెబ్బకు మారిపోయిన చైతూ కెరీర్

Updated on: Jul 07, 2025 | 8:30 PM

ఏదో ఒక రీజన్‌తో వార్తల్లో ఉంటుంది ఏమాయ చేసావె మూవీ. ఇప్పుడు మళ్లీ మహేష్‌తో ముడిపడి ఈ సినిమా టాపిక్‌ ట్రెండ్‌ అవుతోంది. ఇక షాకింగ్ విషయం ఏంటంటే... ఏమాయ చేసావె కథను మహేష్‌ని దృష్టిలో పెట్టుకుని రాశారట గౌతమ్‌ మీనన్‌. అంతే కాదు ఇనిషియల్‌ డ్రాఫ్ట్‌లో మెగాస్టార్‌ చిరంజీవికి కూడా ప్రామినెంట్‌ రోల్‌ ఉందట. చిరంజీవి సెట్‌లో పనిచేసే కుర్రాడి ప్రేమకథగా రాసుకున్నారట గౌతమ్‌.

అయితే కథంతా విన్న మహేష్‌ మాత్రం.. సారీ సార్‌.. మన కాంబో అంటే యాక్షన్‌ సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారు.. ఈ స్టోరీ వద్దు అని సున్నితంగా తిరస్కరించేశారట. దాంతో సీన్‌లోకి శింబు, చైతూ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు.. చైతూ ఏం మాయ చేశావే సినిమాతో హీరోగా తొలి విక్టరీ అందుకున్నాడు. నాగార్జున వారసుడిగా.. ఈ సినిమాతో ప్రూఫ్ చేసుకున్నాడు. చైతూతో పాటే సమంత కూడా ఈసినిమా ద్వారానే టాలీవుడ్కు దొరికింది. లేకుంటే మహేష్‌ – గౌతమ్‌ కాంబోలో విత్‌ మెగాస్టార్‌ ప్రెజెన్స్‌తో… ఏం మాయ చేశావే క్లాసిక్‌ సినిమాగా రిజిస్టర్‌ అయి ఉండేది. ఇక ఈ స్టోరీ తెలియనివారు ఆచార్య లో మిస్‌ అయిన ఛాన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఆచార్యలో చరణ్‌ చేసిన రోల్‌ కోసం ముందు మహేష్‌నే అనుకున్నారు. ‘అంతా అయిపోయింది.. సెట్స్ లో అడుగుపెట్టడమే తరువాయి’ అని ఎదురుచూసే క్రమంలోనే… అది వర్కవుట్ కాకుండా పోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమలో మోసపోయాడు.. తాగుడుకు బానిసగా.. బతుకీడుస్తున్నాడు..! సన్నీ సాడ్ స్టోరీ

నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్‌..

అలెర్ట్.. అలెర్ట్..! వారందరికీ దిల్ రాజు హెచ్చరిక

అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ వాళ్లకు దిమ్మతిరిగేలా చేశాడు