మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే

Edited By: Phani CH

Updated on: Dec 05, 2025 | 4:56 PM

భారతీయ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్‌లు ఎప్పుడూ చర్చనీయాంశమే. నితీష్ తివారీ 'రామాయణం' కార్యరూపం దాల్చగా, రాజమౌళి, త్రివిక్రమ్ 'మహాభారతం' కోసం ఎదురుచూస్తున్నారు. శంకర్ తన డ్రీమ్ 'వేల్పారి'ని వచ్చే ఏడాది తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మహత్తర ప్రాజెక్ట్‌లు వారి కలలను నిజం చేస్తాయా అనేది సినీ అభిమానుల ఆసక్తి.

చేస్తున్న ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా, ముందున్న లైనప్‌ ఎంత గొప్పగా ఉన్నా, మనసులో ఉన్న డ్రీమ్‌ ప్రాజెక్ట్ మాత్రం కుదురుగా ఉండనీయదు. అలాంటి ప్రాజెక్టుల గురించి అవకాశం వచ్చిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉంటారు మన మేకర్స్.ఇంతకీ ఎవరి డ్రీమ్‌ ప్రాజెక్టులు ఎంత వరకు వచ్చినట్టు… రణ్‌బీర్‌తో నేను తీస్తున్న రామాయణ వాస్తవంలోకి వచ్చిందని నమ్మడానికే నాకు రెండేళ్ల సమయం పట్టింది. కల నిజమవుతున్నప్పుడు ఓ వ్యక్తి ఎలాంటి భావోద్వేగానికి గురవుతాడో నాకు మాత్రమే తెలుసన్నారు నితీష్‌ తివారి. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్ మహాభారతం. కానీ, నేను రామాయణ ఘట్టాన్ని ఇంత బాగా తీస్తానని అనుకోలేదు.. అంటూ వారణాసి గ్లోబల్‌ ఈవెంట్‌లో ఓపెన్‌ అయ్యారు రాజమౌళి. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా భారతాన్ని స్క్రీన్‌ మీద చూసుకోవాలన్నదే జక్కన్న జెయింట్‌ డ్రీమ్‌. మన దర్శకుల్లో భారతం గురించి కలలు కంటున్నది జక్కన్న మాత్రమే కాదు, త్రివిక్రమ్‌ కూడా.. ఎన్ని సినిమాలు చేసినా భారతాన్ని సెట్స్ మీదకు, స్క్రీన్స్ మీదకు తీసుకొచ్చినప్పుడే నా కల నెరవేరినట్టు అంటారు గురుజీ. ప్రస్తుతం వెంకటేష్‌తో సినిమా చేస్తున్న ఆయన, నెక్స్ట్ తారక్‌తో ఓ మూవీ చేస్తారు. ఆ తర్వాత డ్రీమ్‌ ఫ్రాజెక్ట్ మీద ఫోకస్‌ చేస్తారా? తమిళ దర్శకుడు శంకర్‌ కూడా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ వేల్పారి గురించి చెబుతూనే ఉన్నారు. వచ్చే ఏడాది భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే సంకల్పం కనిపిస్తోంది శంకర్‌లో. ఇండియన్‌ 2 ఫ్లాప్‌ నుంచి తేరుకుని వేల్పారితో ప్రూవ్‌ చేసుకోవాలన్న టార్గెట్‌తో ప్రీ ప్రొడక్షన్‌ లో ఇన్వాల్వ్ అయ్యారట శంకర్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సామ్‌ రూట్లో సంయుక్త… ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్.. కెరీర్ బ్యాలన్స్ కోసం నానా కష్టాలు

Samantha: అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

Bigg Boss Telugu: బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

Ritu Choudhary: భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

Published on: Dec 05, 2025 04:53 PM