పాన్ ఇండియా ట్రెండ్ లో పెరిగిన గ్రాఫిక్స్ వాడకం

Edited By: Phani CH

Updated on: Oct 15, 2025 | 6:11 PM

సినిమా స్పాన్‌ పెరుగుతోంది. మేకింగ్‌లో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్‌ విషయంలో గ్రాఫిక్స్ కీ రోల్‌ ప్లే చేస్తున్నాయి. ఈ విజువల్‌ ఎఫెక్ట్స్ ఆడియన్స్‌కు ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయో... అదే స్థాయిలో సమస్యలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ఈ సిచ్యుయేషన్‌ను డీల్ చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు మేకర్స్.

రీసెంట్‌ టైమ్స్‌లో భారీ చిత్రాలు చెప్పిన టైమ్‌కు ఆడియన్స్‌ ముందుకు రావటం అన్నది గగనంగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న సినిమాలు రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆన్‌ టైమ్‌ గ్రాఫిక్స్ వర్క్‌ రాక.. పదే పదే రిలీజ్ వాయిదా వేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి మూవీస్‌. ఇండియన్ సినిమాను గ్లోబల్‌ రేంజ్‌కు తీసుకెళ్లటంలో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్‌ ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్‌, హిస్టరికల్ సినిమాల తెరకెక్కిచటంలో గ్రాఫిక్స్‌దే కీలక పాత్ర. అందుకే మేకర్స్ ఆ క్రాఫ్ట్ మీద ఎక్కువ టైమ్‌ కేటాయించటంతో పాటు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త మంది మేకర్స్ ఈ పరిస్థితి మార్చారు. లో బడ్జెట్‌లో బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. మిరాయ్ సక్సెస్‌ టాలీవుడ్‌కు కొత్త దారి చూపిచింది. చాలా మంది మేకర్స్ గతంలో ఉన్న గ్రాఫిక్స్ టీమ్స్‌ను పక్కన పెట్టి కొత్త టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. బడ్జెట్‌ పరంగానూ కొత్త లెక్కలు వేస్తున్నారు. దీంతో అప్‌ కమింగ్ మూవీస్ గ్రాఫిక్స్ విషయంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మరి ఈ ఫార్ములా అన్ని సినిమాలకు వర్కవుట్ అవుతుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తారా..?

అనుమానాలకు చెక్‌ పెడుతూ.. బరిలోకి దిగనున్న వెంకీ..

Trisha: ఇవ్వని నాకు జుజుబీ.. సెటైరికల్‌ మాటలతో సెట్ చేసి పడేసిందిగా

Alia Bhatt: నెరవేరనున్న అలియా కల.. మరి తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పిస్తారా ??

వణుకు పుట్టించడానికి సిద్ధం అంటున్న నాయికలు

Published on: Oct 15, 2025 05:55 PM