ఇళయరాజాకు మరోసారి షాక్ ఇచ్చిన కోర్టు
ఇళయరాజాకు మరోసారి కోర్టు షాక్ తగిలింది. సొంతంగా స్వరపరిచిన పాటలను కూడా వాడుకోవడానికి వీల్లేకుండా ఢిల్లీ హైకోర్టు గతంలో విధించిన స్టేను కొనసాగించింది. సరిగమ కంపెనీ దగ్గర ఉన్న 134 చిత్రాల సంగీత హక్కులపై ఇళయరాజా వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాను స్వరపరిచిన పాటల సంగీత హక్కులపై నెలకొన్న వివాదంలో, సొంత పాటలను వాడుకోవడానికి వీల్లేకుండా కోర్టు గతంలో విధించిన స్టేను కొనసాగిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 13న ఈ స్టే విధించగా, ప్రస్తుతం దానిని కోర్టు ధ్రువీకరించింది. గతంలో ఇళయరాజా తన పాటలను ఇతరులు వాడుకుంటే కోర్టు ద్వారా కేసులు వేసి కోట్లు రాబట్టుకునేవారు. అయితే, ఇప్పుడు ఆయనకే హైకోర్టు షాక్ ఇచ్చింది. గతేడాది విడుదలైన అగత్యా తమిళ సినిమాలో ఎన్ ఇనియా పొన్నిలావే పాటకు సంబంధించిన వివాదంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటను ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా రీక్రియేట్ చేశారు. అయితే, 1976 నుంచి 2001 వరకు ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల సంగీత హక్కులు సరిగమ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఈ పాటలపై తనకు యాజమాన్యం కావాలని ఇళయరాజా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సరిగమ కంపెనీ వాదనలను పరిగణనలోకి తీసుకుని, ఇళయరాజా ఆ పాటలను వాడుకోకుండా స్టే విధించిన కోర్టు, దానిని కొనసాగించింది.
మరిన్ని వీడియోల కోసం :
