ఇలాంటి కొడుకు పుట్టడం నా కర్మ !! ఐ – బొమ్మ రవి తండ్రి ఎమోషనల్

Updated on: Nov 18, 2025 | 4:02 PM

ఐబొమ్మ రవి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి పైరసీ కింగ్‌పిన్‌గా మారిన వ్యక్తి. అతని అరెస్ట్ తర్వాత తండ్రి చిన అప్పారావు చేసిన షాకింగ్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నంలో ఒంటరిగా జీవిస్తున్న అప్పారావు, కొడుకు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనని, తమ బాగోగులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి చెడు చేస్తే చర్యలు తప్పవని ఘాటుగా స్పందించారు. ఈ పరిణామం కుటుంబంలో విషాదం నింపింది.

ఇమ్మడి రవి అలియాస్‌ ఐబొమ్మ రవి.. పైరసీ కింగ్‌పిన్‌గా మారిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సొంతూరు విశాఖపట్నం. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఐబొమ్మ రవి తండ్రి చిన అప్పారావు విశాఖలో ఒంటరిగా జీవిస్తున్నారు. ఓపిక ఉంటే వండుకోవడం..లేదా బయట తెచ్చుకుని తినడం..అది కూడా కుదరకపోతే పస్తులుండడం. ఈ పండుటాకుకు రాలిపోయే దశలో ఇంత దురవస్థ పట్టించాడు తనయుడు. రవి తన బాగోగులను పట్టించుకోడంటున్నారు అప్పారావు. తనకు వచ్చే పెన్షన్‌తోనే బతుకు బండి లాగిస్తున్న ఈ పెద్దాయన.. ఇప్పుడు కొడుకు అరెస్ట్ గురించి రియాక్టయ్యారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. రాంగ్ రూట్‌లో వెళ్లడం తప్పు. చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేశాడు అంటూ…ఐబొమ్మ రవి కేరక్టర్‌ని ఒక్క ముక్కలో తేల్చేశారు తండ్రి అప్పారావు. అంతేకాదు రవిపై కేసుల గురించి తయకు తెలియదని చెప్పిన అప్పారావు.. సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లాడు.. రెండు నెలల క్రితమే రవితో మాట్లాడా అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు అప్పారావు. అంతేకాదు ఉన్నది చాలదా ఎంత తింటావు అంటూ రవికి గడ్డి కూడా పెట్టారు అప్పారావు. ఎలాంటి కొడుకును కన్నానురా దేవుడా! ఇదంతా తన ఖర్మ అంటూ వాపోయారు ఆయన. చెడబుట్టిన కొడుకు వల్ల ఈ వృద్ధాప్యంలో ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ అప్పారావు కుమిలిపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య వల్ల కాదు.. చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే.. ఐ – బొమ్మ రవి దొరికిపోయాడు

నాగార్జునకే షాకిచ్చిన తనూజ !! అతి అంటే ఇదే మరి !!

వీడు సైకోకు ఏమాత్రం తక్కువ కాదు..

సాఫ్ట్ వేర్ CEO నుంచి ఐ – బొమ్మ వ్యవస్థాపకుడిగా

Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్‌