భార్య వల్ల కాదు.. చేసిన ఆ ఒక్క పొరపాటు వల్లే.. ఐ – బొమ్మ రవి దొరికిపోయాడు

Updated on: Nov 18, 2025 | 3:37 PM

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. 1X బెట్ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా రవి కోట్లు సంపాదించాడు. అతని బ్యాంకు ఖాతాలోని 3 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి, ఐ బొమ్మ వెబ్‌సైట్లు బ్లాక్ అయ్యాయి. బెట్టింగ్ కేసులతోనే రవి ఆటకట్టయింది. పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయించారు. 1X Bet బెట్టింగ్ లింకులను ట్రేస్ చేయగా ఐ బొమ్మ లింక్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు సవాలు విసిరిన అనంతరం తనను ఎవ్వరు పట్టుకోగలరని ధీమాతో ఇమ్మడి రవి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇమ్మడి రవి నెదర్లాండ్స్ నుంచి కూకట్ పల్లికి రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రవిని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరుతున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు భార్య వల్ల కాకుండా… ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసుల విచారణతో ఇమ్మడి రవి ఆటకట్టయింది. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో రెగ్యులర్‌గా 1Xబెట్‌ లాంటి యాప్స్‌ ప్రకటనలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐ-బొమ్మలో నెలనెలా 35-40 లక్షల మంది సినిమాలు చూస్తున్నారు. సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్‌ ఊబిలోకి దించేందుకే.. ఐ-బొమ్మ రవితో బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకుల డీల్స్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌తో రవి కోట్లకు కోట్లు సంపాదించాడు. యాప్స్‌ నిర్వాహకులు-రవి మధ్య భారీ లావాదేవీలు గుర్తించారు. డబ్బు ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే దానిపైనా పోలీసుల ఫోకస్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగార్జునకే షాకిచ్చిన తనూజ !! అతి అంటే ఇదే మరి !!

వీడు సైకోకు ఏమాత్రం తక్కువ కాదు..

సాఫ్ట్ వేర్ CEO నుంచి ఐ – బొమ్మ వ్యవస్థాపకుడిగా

Kamal Haasan: కథ నచ్చలేదన్న రజనీ.. లోకనాయకుడు మాత్రం అతని రాకకోసం వెయిటింగ్‌

Chiranjeevi: కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చిరు.. సరికొత్త లుక్ లో మెగాస్టార్