Devara: దేవర ఎవరికి ఎంత ఇంపార్టెంట్ ??
అంతా రెడీ.. సినిమా స్క్రీన్‌పై పడటం ఆలస్యం.. ఆ పై సుమారు రెండున్నర నిమిషాలు ప్రేక్షకులు కూర్చొని... కొరటాల శివ-ఎన్టీఆర్ కలిసి ఏం అద్భుతం చేశారో చూసి ఎలా ఉందో డిసైడ్ చెయ్యడమే లేటు. ఓ వైపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న మూవీ ఇది. రెండేళ్ల క్రితం RRR వచ్చినా అది రామ్ చరణ్‌తో కలిసి నటించిన సినిమా. అయితే అది ఆస్కార్ రేంజ్ సినిమా కూడా.
అంతా రెడీ.. సినిమా స్క్రీన్‌పై పడటం ఆలస్యం.. ఆ పై సుమారు రెండున్నర నిమిషాలు ప్రేక్షకులు కూర్చొని… కొరటాల శివ-ఎన్టీఆర్ కలిసి ఏం అద్భుతం చేశారో చూసి ఎలా ఉందో డిసైడ్ చెయ్యడమే లేటు. ఓ వైపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తున్న మూవీ ఇది. రెండేళ్ల క్రితం RRR వచ్చినా అది రామ్ చరణ్‌తో కలిసి నటించిన సినిమా. అయితే అది ఆస్కార్ రేంజ్ సినిమా కూడా. దీంతో ఎవరెస్ట్ ఎక్కేసిన తర్వాత.. ఇంకా ఎక్కడానికి ఏం ఉంటుంది. సో.. ఎన్టీఆర్‌పై ఆల్రెడీ ఆ భారం ఉందన్నమాటే. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు 350 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టారట. అందులో హీరో-డైరక్టర్ల రెమ్యూనిరేషనే దాదాపు 100కోట్లు ఉంటుందని అంచనా. ఇక మిగిలిన దాంట్లో సింహ భాగం సీజీ గ్రాఫిక్స్ కోసం ఎలాగూ ఖర్చు పెట్టేసే ఉంటారన్న విషయం మనకు ట్రైలర్లు చూస్తేనే అర్థమవుతోంది. నిజానికి ఆచార్య లాంటి కళాఖండాన్ని తీసిన తర్వాత కూడా కొరటాల శివ హిట్ల హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారంటే కారణం ఎన్టీఆర్. ఆ కటౌక్ ఒక్కటి చాలు.. ఫాం కోల్పోయిన కొరటాలకు మళ్లీ లైఫ్ ఇస్తుందన్న భరోసా. నిజానికి ఆచార్య రిజల్ట్ తర్వాత.. ఎన్టీఆర్ – కొరటాలకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. బట్.. ఎన్టీఆర్ నాట్ లైక్ దట్. మాట ఇచ్చాడు…నమ్మకం ఉంచాడు… సెకెండ్ పార్ట్‌కి కూడా సై అన్నాడు. సో.. అక్కడ బతికిపోయాడు కొరటాల. ఆచార్య వరకు అన్ స్టాపబుల్ అంటూ దూసుకెళ్లిన కొరటాల శివకు… ఒక్కసారిగా బ్రేక్ పడింది. మరి ఎన్టీఆర్ శివ లైఫ్‌ని ఛేంజ్ చేస్తాడా.. లేదా కొరటాలే ఎన్టీఆర్ జోరుకు బ్రేక్ వేస్తాడా..? మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. మొత్తంగా దేవర కొరటాలకి అత్యంత కీలకం. ఈ సినిమా గానీ తేడా జరిగిందో… కొరటాల కూడా మరో శీను వైట్ల అయినా ఆశ్చర్యం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: