Hey Balwanth: OTTలోకి వస్తున్న సుహాస్ న్యూ ఫిల్మ్

Updated on: Mar 29, 2026 | 12:57 PM

సుహాస్ నటించిన 'హే బల్వంత్' చిత్రం మార్చి 31 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అడల్ట్ టచ్, హాస్యంతో కూడిన ఈ సినిమా డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తన తండ్రి వ్యాపారం గురించి తెలుసుకున్న హీరో పడే సంఘర్షణ, ప్రేమ, నైతిక విలువలతో అల్లుకున్న ఈ కుటుంబ హాస్య చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు.

గత నెలలో సుహాస్ హీరోగా నటించిన హే బల్వంత్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న ఈ సినిమా డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓటీటీ మేకర్స్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటికి వచ్చింది. సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా ‘హే బల్వంత్’. తొలుత ఈ చిత్రానికి ‘హే భగవాన్’ అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. గుంటూరు నేప‌థ్యంలో ‘హే బ‌ల్వంత్‌’ సినిమాను రూపొందించారు. యువ‌కుడైన కృష్ణ‌ అలియాస్ సుహాస్‌కు తండ్రి వ్యాపారాన్ని కొన‌సాగించాల‌నే ఆస‌క్తి ఉంటుంది. అయితే త‌న తండ్రి చేసే వ్యాపారం ఏదో తెలియ‌టంతో త‌ను షాక‌వుతాడు. అదే స‌మ‌యంలో మిత్ర‌ అలియాస్ శివానీ నాగ‌రంతో ప్రేమ‌లో ఉంటాడు. మిత్ర ఓ ఎన్‌జీఓను న‌డుపుతుంటుంది. ప్రేమ, నైతిక విలువలు, తన తండ్రి రావు బాల్వంత్ చేస్సే బిజినెస్ విషయం తెలిస్తే ఏమ‌వుతుంద‌నే ఆలోచ‌న‌ల‌ మధ్య కృష్ణ‌ ఇరుక్కుపోతాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ, తండ్రీ కొడుకు మ‌ధ్య అనుబంధం, అస‌లేం జ‌రిగింద‌నే నిజానిజాలు, చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు అనేదే అస‌లు క‌థాంశంగా సినిమా రూపొందింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!

రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌

పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ

AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే

Follow Us