Teja Sajja: ఆ పెద్ద దర్శకుడు.. నన్ను వాడుకొని వదిలేశాడు..

Updated on: Sep 11, 2025 | 7:45 PM

చిన్నప్పటి ఇంద్రగా కనిపించి తన పర్ఫార్మెన్స్‌తో అప్పట్లోనే అందర్నీ ఆకట్టుకున్న తేజా సజ్జా.. హీరోగా కూడా దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగి మారిపోయి.. ఇప్పుడు మిరాయ్‌ సినిమాతో .. మరింత బలంగా బాక్సాఫీస్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాన్ ఇండియా రేంజ్‌లో తిరిగేస్తున్నాడు.

ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన తేజా సజ్జా… తనను ఓ బడా దర్శకుడు మోసం చేశాడంటూ చెప్పి షాకిచ్చాడు. తనను వాడుకుని వదిలేశాడంటూ.. కామెంట్ చేశాడు. ఓ పెద్ద డైరెక్టర్ నన్ను కలిసి కథ చెప్పాడు. కథ చాలా బాగుంది. కథ నచ్చడంతో నేను సినిమా చేస్తానని చెప్పాను. 15 రోజుల పాటు షూటింగ్ కూడా చేశా.. అయితే ఆతర్వాత నా ప్లేస్‌లో వేరొక హీరోని తీసుకున్నారు. నన్ను మాక్ షూటింగ్ కోసమే తీసుకున్నారని, అందుకే 15 రోజుల పాటు వాడుకొని వదిలేశారని ఆ తర్వాత తెలిసింది అని చెప్పుకొచ్చాడు తేజ. అయితే ఆ దర్శకుడు ఎవరు.? తన ప్లేస్ లో రీప్లేస్ చేసిన హీరో ఎవరు అనేది చెప్పలేదు. తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మల్లెపూలకే లచ్చ ఫైను.. ఎయిర్ పోర్టులో హీరోయిన్ కు వింత అనుభవం

TOP 9 ET: కాంబో ప్యాక్.. కాంతార టికెట్ కొంటే ప్రభాస్ మూవీ ట్రైలర్ ఫ్రీ | AA 22 నుంచి అనుకోని అప్‌డేట్

రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ

‘డాక్యుమెంటరీనే కాదు డబల్ హెడేక్‌’ చిక్కుల్లోకి నయన్‌.. హైకోర్టుకు కొత్త నోటీసులు

చిన్న జీతంతో సంతోషంగా బతికా.. ఇప్పుడు లక్షల జీతంతో నరకం చూస్తున్నా