Trivikram Srinivas: పాపం గురూజీ.. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడుగా

Updated on: Feb 09, 2026 | 7:13 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే పౌరాణిక చిత్రంపై సందిగ్ధత నెలకొంది. మొదట అల్లు అర్జున్‌తో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తిరిగి అల్లు అర్జున్‌తోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు స్టార్ల మధ్య గురూజీ సరైన నిర్ణయం తీసుకోవడంలో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం, గాడ్ ఆఫ్ వార్ పేరుతో ప్రచారంలో ఉంది. ఈ సినిమా హీరో ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మొదట అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై త్రివిక్రమ్ కథ సిద్ధం చేసి, అనౌన్స్‌మెంట్ వీడియో కూడా విడుదల చేశారు. అయితే, అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీ అవ్వడంతో, ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. నిర్మాత నాగవంశీ సైతం తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు. ఎన్టీఆర్ కార్తికేయ స్వామి బుక్ కూడా చదివారు. మైథలాజికల్ సినిమా తారక్‌తో ఫిక్స్ అయిందని అనుకుంటున్న తరుణంలో, మళ్లీ ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తోనే చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్

తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

చైనాలో సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే రోబోట్ బోల్ట్ ఆవిష్కరణ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై పొలిటికల్ వార్