సరికొత్తగా దూసుకొస్తున్న నయా లేడీస్
కొంతమంది హీరోయిన్లు తమ తొలి అడుగుతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటారు. మానస వారణాసి, మమిత బైజు, సారా అర్జున్, అనస్వర రాజన్ వంటి యువ తారలు అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతున్నారు. వారి ప్రాజెక్టులు, సోషల్ మీడియా క్రేజ్, భవిష్యత్తులో టాప్ హీరోయిన్‌లుగా ఎదిగే అవకాశాలను ఈ కథనం విశ్లేషిస్తుంది. దక్షిణాది సినిమాపై వారి ప్రభావం, అభిమానుల అంచనాలను ఇది హైలైట్ చేస్తుంది.
కొంతమంది హీరోయిన్ల ఎంట్రీ స్పెషల్‌గా కనిపిస్తుంటుంది. వాళ్లని స్పెషల్‌గా పోట్రే చేసినట్టు ఉండకపోయినా, ఆయా ప్రాజెక్టుల్లో వాళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఫ్లాష్ అవుతారు. కాస్త ట్రై చేస్తే టాప్ చెయిర్ కోసం కాంపిటిషన్‌లో ఉంటారన్న కాన్ఫిడెన్స్ కలిగిస్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవారిలో ఎవరు అలాంటి ఫీల్ క్రియేట్ చేస్తున్నారు? కమాన్ లెట్స్ వాచ్… ఒక హగ్ ఇస్తావా? అంటూ యూత్ గుండెలకు చాలా దగ్గరైపోయారు మానస వారణాసి. కపుల్ ఫ్రెండ్లీ సినిమా సక్సెస్‌లో మానసకి మేజర్ పార్ట్ ఉందని చెప్పకనే చెప్పేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ ఆమె క్రేజ్‌కి అద్దం పడుతున్నాయి. మంచి రోల్స్ పడితే తప్పకుండా పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయన్నది టాక్. సేమ్, ఇలాంటి ఫీల్ క్రియేట్ చేస్తున్నారు మమిత బైజు. కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు ఎక్కువే వేస్తా… నువ్వు పడు చాలు అంటూ సూర్యని లవ్లీగా ఛాలెంజ్ చేస్తున్నారు మమిత. సూర్యతో ఆమె నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రేమలు సినిమా నుంచే ఈ బబ్లీ గర్ల్ మీద మంచి హోప్స్ పెంచుకున్నారు మన వారు. అటు నార్త్ ధురంధర్‌తో దూసుకుపోతున్నారు సారా. సారా అర్జున్‌ని చూసీ చూడగానే.. ఏంటి ఈ అమ్మాయి అప్పుడే ఇంత పెద్దదైపోయిందా? అని ఆశ్చర్యపోయారు. నేటి ట్రెండీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా, తన కేరక్టర్‌ని స్క్రీన్ మీద గ్రేస్‌తో క్యారీ చేశారనే పేరు తెచ్చుకున్నారు సారా. నార్త్ తో పాటు సౌత్‌లోనూ మంచి ఫ్యూచర్ ఉన్న లేడీ అనే ట్యాగ్‌లైన్ ఎప్పుడో తెచ్చేసుకున్నారు. సారా మాత్రమే కాదు, ఛాంపియన్‌తో అనస్వర రాజన్ కూడా మన వారికి దగ్గరయ్యారు. సౌత్‌లో చాలా సినిమాలతో బిజీగా ఉన్న లేడీ.. నెక్స్ట్ సక్సెస్ మీదే టాలీవుడ్‌లో ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది మాత్రం నిజం…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్