జనరేషన్ మారింది.. నాటి ఫ్లాపులే.. నేటి విజయాలు

Edited By:

Updated on: Sep 06, 2026 | 11:03 AM

ఒకప్పుడు థియేటర్లలో ఫ్లాప్‌గా నిలిచిన కొన్ని తెలుగు సినిమాలు ఇప్పుడు రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ‘పంజా’ మొదటి రోజే రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించగా, మహేశ్‌ బాబు ‘ఖలేజా’ ఫుల్‌ రన్‌లో రూ.10.78 కోట్లు రాబట్టింది. రామ్‌ చరణ్‌ ‘ఆరెంజ్‌’ రూ.8 కోట్లు, అల్లు అర్జున్‌ ‘ఆర్య 2’ సుమారు రూ.8 కోట్లు వసూలు చేశాయి. దీంతో అప్పటి ఫ్లాపులు ఇప్పుడు కల్ట్‌ క్లాసిక్స్‌గా మారుతున్నాయి.

ఒకప్పుడు థియేటర్లలో తుస్సుమన్న సినిమాలు.. ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే ఇదెక్కడి మాస్ రా మావా అనిపించక మానదు. అప్పట్లో ఆడియన్స్ మూడ్ సెట్ కాక ప్లాపైన చిత్రాలు పదేళ్ల తర్వాత రీ-రిలీజ్ అవుతూ కోట్లలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి ఒకప్పుడు డిజాస్టర్లుగా మిగిలి ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఆ క్రేజీ రీ-రిలీజ్ సినిమాలేంటో ఓసారి చూద్దామా..? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 15 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన పంజా సినిమా రీ-రిలీజ్‌లో రఫ్ఫాడిస్తూ మొదటి రోజే 4 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ డ్రామా 2011లో నిరాశ పరిచింది. ఇక మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో ఒకటిగా మిగిలిన ఖలేజా రీ రిలీజ్‌లో మాత్రం రప్ఫాడించింది. ఫస్ట్ డే 6.75 కోట్లు, ఫుల్ రన్‌లో ఏకంగా 10.78 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ సినిమాను రెండుసార్లు రీ రిలీజ్ చేస్తే ఏకంగా 8 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది. ఇక అల్లు అర్జున్ ఆర్య 2 సినిమా 2009లో ఫ్లాప్.. కానీ రీ-రిలీజ్ చేస్తే మొదటి రోజు 3.83 కోట్లు, ఫుల్ రన్‌లో సుమారు 8 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. అప్పట్లో నిరాశపరిచిన ఈ సినిమాలన్నీ ఇప్పుడు మాత్రం క్లాసిక్స్‌గా మారిపోతున్నాయి. ధనుష్ హీరోగా వచ్చిన 3 సినిమా విడుదలైన కొత్తలో పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా, రీ-రిలీజ్‌లో మాత్రం థియేటర్ల దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఒకప్పుడు ఫ్లాప్ అనే ముద్ర వేయించుకున్న సినిమాలిప్పుడు మళ్ళీ థియేటర్లలోకి వస్తుంటే వసూళ్ల జాతర కురుస్తుంది. అప్పట్లో ఈ సినిమాలను ఎలా మిస్ అయ్యామా అని ఫీల్ అవుతూ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రీ-రిలీజ్‌లో రఫ్ఫాడిస్తున్న పంజా సినిమా పంజాకు మొదటి రోజే 4 కోట్ల గ్రాస్, ఖలేజాకు ఫస్ట్ డే 6.75 కోట్లు, ఫుల్ రన్‌లో ఏకంగా 10.78 కోట్లు, రీ రిలీజ్‌లో ఏకంగా 8 కోట్లు వసూలు చేసిన ఆరెంజ్, ఆర్య 2 ఫస్ట్ డే 3.83 కోట్లు, ఫుల్ రన్‌లో సుమారు 8 కోట్లు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Loading...
Unable to load recommendations.
Follow Us