ఆ భామ జాతకం మారేదేలే.. హిట్ కొట్టేదెలే.. పాపం ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఏంటి

Updated on: Oct 09, 2025 | 7:19 PM

జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లతో కెరీర్ ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల రెండు నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు నిరాశపరిచాయి. శ్రీదేవి వారసురాలిగా అరంగేట్రం చేసినా, సరైన హిట్ దక్కలేదు. అయితే, తెలుగులో దేవరతో విజయం సాధించి, ప్రస్తుతం పెద్దిలో నటిస్తూ దక్షిణాదిలో అవకాశాలు మెరుగుపరుచుకుంటున్నారు.

నటి జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎదుర్కొంటున్న కెరీర్ సవాళ్లు చర్చనీయాంశంగా మారాయి. 2018లో ధడక్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ, శ్రీదేవి కుమార్తెగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గుంజన్ సక్సేనా, రూహి, మిలి వంటి సినిమాలతో నటన పరంగా మెరుగుపడినా, బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా 2025లో విడుదలైన హోమ్‌బౌండ్, పరం సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి వంటి మూడు చిత్రాలు స్వల్ప వ్యవధిలో వచ్చి నిరాశపరచడంతో ఆమె కెరీర్‌పై ప్రభావం పడింది. ఈ చిత్రాల్లో హోమ్‌బౌండ్ ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడం కొంత ఊరటనిచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కశ్మీర్ టూ కన్యాకుమారి.. అంతా కన్నడమే

Samantha: సమంత ప్లానింగ్ మామూలుగా లేదుగా..

మంచిర్యాల జిల్లాలో రెచ్చిపోయిన స్మగ్లర్లు

దీపిక Vs త్రిప్తీ.. గ్యాప్‌ ఉన్నట్టా.. లేనట్టా

కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర