ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్‌గా అడిగేస్తున్నారు..!

Updated on: Sep 16, 2025 | 3:35 PM

నైనిక..! సోషల్ మీడియాలో పాపులర్..! ఓ పాపుల్‌ డ్యాన్స్‌ షోతో బుల్లి తెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నైనిక.. బిగ్ బాస్‌ షోతో.. బిగ్ బాస్ సీజన్‌ 8తో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు షోల్లో కనిపిస్తూ వైరల్ అవుతూ వుంటుంది. అయితే ఈ బ్యూటీ.. తాజాగా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులపై.. క్యాస్టింగ్ కౌచ్‌ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన నైనిక.. ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. సినిమా ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్ గా కమిట్మెంట్ అడుగుతున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మొన్నామధ్య నాకు ఒకరు ఫోన్ చేసి.. బ్రాండ్‌ ప్రమోషన్స్‌ చేయాలన్నారు. పర్సనల్‌ రిక్వెర్‌మెంట్‌ అని అన్నాడు నాకు మొదట్లో అర్ధం కాలేదు. ఆతర్వాత పర్సనల్‌ రిక్వెర్‌మెంట్‌ అని పదే పదే అంటుంటే అర్ధమైంది. పైగా ఆ వ్యక్తి నాకు తెలిసిన వాడు కావడంతో.. ‘మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్‌ అయింది’ అని చెప్పాడు. కొంతమంది అమ్మాయిల వల్లే ఇది క్రియేట్ అవుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని క్రియేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది ఈమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిక్కుల్లో బాలయ్య బ్యూటీ.. విచారణకు నోటీసులు