పిలిచి అక్కున చేర్చుకున్నాడు సరే.. మరి తాగుడుకు బానిసైన రవి మారతాడా ??

Updated on: Jul 16, 2025 | 9:21 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 25 సినిమాల్లో నటించిన రవి రాథోడ్.. ఇప్పుడు తాగుడుకు బానిసై దుర్భర స్థితిలో బతుకీడుస్తూ కనిపించాడు. అంతే.. సోషల్ మీడియా ఈ ఒకప్పటి ఈ లిటిల్ స్టార్‌ను వైరల్ చేసింది. మునుపు తనను చదివించాలని చూసిన లారెన్స్ వరకు చేర్చింది. లారెర్స్ కూడా రవి రాథోడ్‌ను అక్కున చేర్చుకుని తానున్నా అంటూ భరోసా ఇచ్చిన పరిస్థితి.

మరి ఇలాంటి పరిస్థితుల్లో లారెన్స్‌ ఇచ్చిన భరోసా తో రవి రాథాడ్ మారతాడా? బాగుపడతాడా..? రవి రాథోడ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రోడ్డున పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న హీరో రాఘవ లారెన్స్ రవిని దత్తత తీసుకుని మంచి స్కూల్‌లో చేర్పించాడు. కానీ అతను మాత్రం ఇంటికి తిరిగొచ్చేశాడు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో తాగుడుకు బానిసైపోయాడు. మందు లేకపోతే బతకలేను అన్నంత దీన స్థితికి చేరుకున్నాడు. రవి రాథోడ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రోడ్డున పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న హీరో రాఘవ లారెన్స్ రవిని దత్తత తీసుకుని మంచి స్కూల్‌లో చేర్పించాడు. కానీ అతను మాత్రం ఇంటికి తిరిగొచ్చేశాడు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో తాగుడుకు బానిసైపోయాడు. మందు లేకపోతే బతకలేను అన్నంత దీన స్థితికి చేరుకున్నాడు. దీంతో ఎట్టకేలకు రవి రాథోడ్ చెన్నై వెళ్లి లారెన్స్ ను కలిశాడట. అతని పరిస్థితి చూసి చలించిపోయిన లారెన్స్‌ వెంటనే రూ.50 వేలు ఆర్థిక సాయం చేశాడు. అంతేకాదు ఆల్కహాల్‌ అడిక్షన్‌ తగ్గేందుకు తనకు లారెన్స్ అన్ని మెడికల్ టెస్టులు చేయించారని రవి చెప్పాడు. మందులు కూడా ఇప్పించారన్నాడు. అయితే లారెన్స్ మాస్టర్ మొదట‌ తనను చూడగానే ఓ మాటన్నాడట. రవి రాథోడ్… నీలా తాగేవాళ్లకు నేను సపోర్ట్‌ చేయను. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని ఇలా సపోర్ట్‌ చేస్తున్నానంతే! అని లారెన్స్ చెప్పినట్టు చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట Vs కృష్ణ వంశీ !! ఒకప్పుడు వీళ్లు ఎంతలా గొడవ పడ్డారంటే ??

పాటతో దేశాన్ని ఊపిన ఫోక్ సింగర్‌కు కింగ్ నాగ్ బంపర్ ఛాన్స్?

షో చూడు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ పట్టు.. సుడిగాలి సుధీర్ నుంచి బంపర్ ఆఫర్ !

‘నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి’ మాజీ భార్య దెబ్బకు..

బంగారం లాంటి ఛాన్స్‌ వస్తే.. ఈ పిల్ల కాళ్లతో తన్నింది..