థియేటర్ల బంద్‌ ఉందా? లేదా? క్లారిటీ

Updated on: May 26, 2025 | 4:13 PM

థియేటర్ల బంద్ హెచ్చరికలతో.. ఫిల్మ్‌ఛాంబర్‌లో కీలక సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. థియేటర్లలో పర్సంటేజి విధానాన్ని అమలు చేయాలని పట్టుబట్టారు. ఎగ్జిబిటర్లు. పర్సంటేజి విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఎగ్జిబిటర్ల నిర్ణయం వెనుక నలుగురు ఉన్నారని, పవన్ సినిమాకు ముందే ఎందుకు వివాదం సృష్టిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం ముగిసింది. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్.. థియేటర్స్ బంద్ పై క్లారిటీ ఇచ్చారు. సమావేశ అనంతరం జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదంటూ క్లారిటీ ఇచ్చాడు.. దామోదర్ ప్రసాద్. అలాగే మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నామని.. నిర్ణీత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటామంటూ చెప్పారు. అంతేకాదు థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరు నమ్మోద్దు అని స్పష్టం చేశారు. అలాగే థియేటర్ల బంద్ ప్రచారం.. పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించిందన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరు పరిష్కరించలేరని.. తమకు తామే పరిష్కరించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇద్దరూ ఒకే లైన్లో.. పూనకాలు గ్యారెంటీ..

ఏడుపుగొట్టు సినిమా అంటూ కామెంట్.. దెబ్బకు హీరో వైరల్

చడీచప్పుడు కాకుండా… విధ్వంసాన్ని మొదలెట్టిన చిరు

‘వెళ్లి నాన్న కాళ్లపై పడాలని ఉంది’ మంచు మనోజ్‌ ఎమోషనల్

ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్‌