ఓటీటీల నిర్ణయంతో సినిమా బడ్జెట్‌లు తలకిందులవుతాయా

Edited By:

Updated on: Nov 15, 2025 | 9:21 AM

నెగ్గడం, తగ్గడం గురించి సినిమాలో డైలాగులు వస్తుంటే థియేటర్లలో చప్పట్లు పడుతుంటాయి. అదే సిట్చువేషన్‌ సినిమాకు వస్తే..! నెగ్గితే ఫర్వాలేదుగానీ, తగ్గాల్సిన సిట్చువేషన్‌ వస్తే సీన్‌ ఎలా ఉంటుంది? ప్యాన్‌ ఇండియాను దాటి ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్న టాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌లో కోత పడుతుందా? కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న ఓటీటీ ఇష్యూ ప్రభావం బడ్జెట్‌ మీద పడనుందా? కమాన్‌ మాట్లాడుకుందాం ఎక్స్ క్లూజివ్‌గా.

నెగ్గడం, తగ్గడం గురించి సినిమాలో డైలాగులు వస్తుంటే థియేటర్లలో చప్పట్లు పడుతుంటాయి. అదే సిట్చువేషన్‌ సినిమాకు వస్తే..! నెగ్గితే ఫర్వాలేదుగానీ, తగ్గాల్సిన సిట్చువేషన్‌ వస్తే సీన్‌ ఎలా ఉంటుంది? ప్యాన్‌ ఇండియాను దాటి ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్న టాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌లో కోత పడుతుందా? కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న ఓటీటీ ఇష్యూ ప్రభావం బడ్జెట్‌ మీద పడనుందా? కమాన్‌ మాట్లాడుకుందాం ఎక్స్ క్లూజివ్‌గా. మన హీరోలు చాలా మంది చేసే సినిమాలు ప్యాన్‌ ఇండియా రేంజ్‌కి ఇంచు కూడా తగ్గడం లేదు. పెడుతున్న బడ్జెట్‌, తీసుకుంటున్న సమయం.. అన్నీ ఇంటర్నేషనల్‌ క్వాలిటీ కోసమే. అంతవరకు ముచ్చట బాగానే ఉంది. కాకపోతే అక్కడే వస్తుంది చిక్కంతా. ఎంత ఖర్చుపెట్టినా, ఎంతైనా ఖర్చుపెట్టడానికి మేకర్స్ సిద్ధమైనా.. వారికున్న భరోసా ‘ఓటీటీ’. రొట్టెకి సరిపడా పిండిని ఓటీటీలు అందిస్తున్నాయనే కాన్ఫిడెన్స్ మేకర్స్ ని ముందుకు నడిపిస్తోంది. అయితే… ఓటీటీలు ఎన్ని సినిమాలను భరిస్తాయి? వారానికి ఓ సినిమా లెక్క వేసుకున్నా… స్పెషల్‌ అకేషన్స్ కి కొన్నిటిని అదనంగా చేర్చుకున్నా ఆరు పదులను మించి అలాట్‌ చేయడానికి బడ్జెట్‌ ఉండట్లేదు ఓటీటీల్లో. మన దగ్గర పెద్దా, చిన్నా, అనువాద సినిమాలతో కలిపితే మూడు వందల సినిమాల దాకా సిద్ధమవుతున్నాయి ప్రతి ఏటా. వీటిని ఏం చేయాలి? ఒకప్పుడు థియేట్రికల్‌ బిజినెస్‌ని బట్టి మూవీస్‌ బడ్జెట్‌ ఉండేది. ఇప్పుడది ఓటీటీల మీద హోప్స్ తో విపరీతంగా పెరిగింది. మరి ఇలాంటప్పుడు ఓటీటీలు ‘మాకొద్దు’ అంటూ బోర్డు పెట్టేస్తే పరిస్థితి ఏంటి? పెద్ద సినిమాలు ఏదో ఒక క్రేజ్‌తో ఒడ్డున పడే ఛాన్సులున్నాయి. చిన్న సినిమాల మాటేంటి? పే.. పర్‌ వ్యూ అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఎంత మంది చూస్తే అన్ని డబ్బులు.. థియేటర్లదాకా వెళ్లాల్సిన పని లేకుండా, ఇంట్లో కూర్చుని డబ్బులు కట్టి చూడటం అన్నమాట. అలా కట్టాల్సి వచ్చినప్పుడు జనాలు ఎంత మంది పే చేస్తారు? ఎన్ని డబ్బులు వస్తాయి.. అందులో నిర్మాతకు ఎంత మిగులుతుంది? అనేది బిగ్‌ క్వశ్చన్‌. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ వేసేటప్పుడే వీలున్న చోట కోత విధిస్తే సరిపోతుంది కదా అనే సలహాలు వినిపిస్తున్నాయి మేకర్స్ కి. అది సాధ్యమయ్యే పనేనా.. అనే డౌట్స్ కూడా రెయిజ్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ వారసులు

Published on: Nov 15, 2025 09:21 AM