ఫ్యామిలీ బొమ్మ తియ్.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయ్..

Edited By:

Updated on: Jan 22, 2026 | 4:12 PM

యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలే రికార్డులు తిరగరాస్తాయనేది అపోహ. కుటుంబ కథా చిత్రాలకు ఆ సత్తా ఉందని టాలీవుడ్ చరిత్ర నిరూపించింది. కలిసుందాం రా నుండి శంకరవరప్రసాద్ గారి వరకు ఎన్నో ఫ్యామిలీ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సులభంగా అధిగమించాయి. ఒక కుటుంబం నుండి పదుల సంఖ్యలో టికెట్లు తెగే శక్తి ఫ్యామిలీ బొమ్మలకే ఉంది. అల వైకుంఠపురములో, సంక్రాంతికి వస్తున్నాం వంటివి దీనికి ఉదాహరణలు.

ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టాలంటే యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రమే సాధ్యమనుకుంటారు.. కానీ చరిత్ర అలా లేదు. యాక్షన్ కంటే ఫ్యామిలీ సినిమాలకే రికార్డులు తిరగరాసే సత్తా ఉందని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇంకా అదే జరుగుతుంది. మిలీనియం నుంచి మొదలుపెడితే.. ఇప్పటికీ కుటుంబ కథా చిత్రాలే రికార్డులు తిరగరాస్తున్నాయి. ఈ ఫ్యామిలీ బొమ్మ చేస్తున్న మ్యాజిక్ ఏంటి..? నిజమేగా.. కలిసుంటే కలదు సుఖం.. ఓ మాస్ సినిమా చేస్తే సింగిల్ టికెట్ తెగుతుంది మహా అయితే మరో టికెట్ తెగుతుంది. కానీ అదే ఫ్యామిలీ సినిమా చేస్తే ఒకే కుటుంబం నుంచి పదుల సంఖ్యలో టికెట్లు తెగుతాయి. అదీ మరి ఫ్యామిలీ బొమ్మకు ఉన్న పవర్. పాతికేళ్ల నాటి కలిసుందాం రా నుంచి నేటి మన శంకరవరప్రసాద్ గారు వరకు కుటుంబ కథా చిత్రాలు రప్ఫాడించాయి. ఇండస్ట్రీ రికార్డుల్ని మంచినీళ్లు తాగినంత ఈజీగా ఫ్యామిలీ సినిమాలు తిరగరాస్తున్నాయి. 2000లో వెంకటేష్ కలిసుందాం రా అప్పటి రికార్డుల్ని తిరగరాసింది. మధ్యలో ఇంద్ర, పోకిరి లాంటి యాక్షన్ సినిమాలు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసినా.. 2020లో అల వైకుంఠపురములో అంటూ ప్యూర్ ఫ్యామిలీ సినిమాతో 250 కోట్లు కొల్లగొట్టారు అల్లు అర్జున్. ఆ ఏడాది సరిలేరు నీకెవ్వరు కూడా రప్ఫాడించినా.. లాంగ్ రన్‌లో అల వైకుంఠపురములో విజేతగా నిలిచింది. ఇక గతేడాది సంక్రాంతికి వస్తున్నాం కూడా రీజినల్ సినిమాలలో కొత్త రికార్డులు తిరగరాసింది. 300 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది.. వెంకటేష్‌కు ఫ్యామిలీస్‌లో ఉన్న పట్టు మరోసారి నిరూపించింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ పండక్కి మన శంకరవరప్రసాద్ గారు కూడా ఈజీగా ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసారు. కేవలం 8 రోజుల్లోనే 300 కోట్లు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్ ఎంత మాస్ హీరో అయినా.. ఫ్యామిలీస్ థియేటర్‌కు కదిలితే క్లాస్ సినిమాతోనూ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించారు అనిల్ రావిపూడి. మొత్తానికి ఈ ఫ్యామిలీ జోనర్ కేరాఫ్ ఇండస్ట్రీ హిట్స్‌గా మారిందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క సినిమాతో.. చేజారిన నెంబర్ వన్ పీఠంపై కన్నేసిన బాలీవుడ్

ప్యారడైజ్ Vs పెద్ది.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా

మాకు మేమే.. మాతో మేమే అంటున్న కుర్ర హీరోలు

రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??

కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు