ఆగస్టులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల జాతర.. ఈ మూడు సినిమాలే టాలీవుడ్‌కు అసలు పరీక్ష!
టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు మంచి ఆదరణ లభిస్తున్న వేళ ఆగస్టులో మూడు కీలక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘కొరియన్ కనకరాజు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘ఇరుముడి’ సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సిద్ధమయ్యాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, వినోదంతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మరోసారి విజయ పరంపర కొనసాగిస్తాయా అన్న ఆసక్తి నెలకొంది.
తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాల హవా నడుస్తుందిప్పుడు. కథ రొటీన్‌గా ఉన్నా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటే చాలు థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. మరి ఇదే ఊపులో ఆగస్టులో రాబోయే 3 ఫ్యామిలీ మూవీస్ ఈ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తాయా..? బాక్సాఫీస్ దగ్గర సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాయా..? ఇంతకీ ఏంటా సినిమాలు..? టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎలాంటి కథతో వచ్చినా సరే.. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయితే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన శంకరవరప్రసాద్ గారుతో పాటు నారినారి నడుమ మురారి కుటుంబ ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఈ మధ్యే మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించారు. ఈ సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని ఆగస్టులో మరికొన్ని ఫ్యామిలీ మూవీస్ వచ్చేస్తున్నాయి. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న విడుదలకు ముస్తాబవుతోంది. అలాగే రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ఇరుముడి కూడా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండూ పక్కా ఫ్యామిలీ సినిమాలే. ఈ ఫ్యామిలీ సినిమాల జాతరలో ముందుగా ఆగస్టు 7న కొరియన్ కనకరాజు వస్తున్నాడు. ఇందులో హారర్ అంశాలున్నా.. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నాడు కనకరాజు. ఈ సినిమాలన్నీ మెప్పిస్తే ఈ ఆగస్టు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు బంగారు బాతుగా మారడం ఖాయం. మరి ఇందులో ఎన్ని ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్
ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్ లైట్లు
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి