చిక్కుల్లో బాలయ్య బ్యూటీ.. విచారణకు నోటీసులు

Updated on: Sep 16, 2025 | 3:32 PM

ఆన్‌ లైన్ బెట్టింగ్ యాప్స్‌ పై మాత్రమే కాదు.. ఆ యాప్స్‌ను ప్రమోట్స్‌ చేసే వారిపై కూడా గత కొన్ని రోజులుగా ఈడీ ఫోకస్ చేసింది. ఈ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీలను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను ఈ విషయంగా విచారించిన ఈడీ.. తాజాగా ఊర్విశి రౌతేలకు.. మిమి చక్రవర్తికి నోటీసులు పంపించింది.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను సెప్టెంబర్ 16న, మాజీ ఎంపీ మిమి చక్రవర్తిని సెప్టెంబర్ 15న ఈడీ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విచారణ కోసం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం వారిద్దరినీ ప్రశ్నించి, వారు ఎలా, ఎప్పుడు డబ్బు అందుకున్నారో తెలుసుకోవాలని ED కోరుకుంటోంది. ఇక ఈడీ గతంలో అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులను ప్రశ్నించింది. ఇటీవల, సెప్టెంబర్ 4న శిఖర్ ధావన్‌కు సమన్లు ​​జారీ అయ్యాయి. ఆ సమయంలో, శిఖర్ ధావన్ PMLA చట్టం కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఆగస్టులో, సురేష్ రైనా కూడా ఢిల్లీలో హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఊర్వశికి, మిమీ చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో మరికొంత మంది సినీతారలకు ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అక్రమ నెట్‌వర్క్ మొత్తాన్ని దాని మూలాల నుండి నిర్మూలించడం ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్న తారలకు ఈడీ నోటీసులు జారీ చేయనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Guntur: క్షుద్రపూజల అరిష్టం తొలగిపోవాలంటూ శివుడికి అభిషేకాలు

2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి

వర్షాల ఎఫెక్ట్ మరోసారి నిలిచిపోయిన ముంబై లో మోనోరైలు

ముషీరాబాద్ లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

యూరియూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్లదే