ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ మలయాళ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా..

Edited By: Phani CH

Updated on: Dec 05, 2025 | 4:59 PM

నార్త్ హీరోలు సౌత్‌లో విలన్లుగా చేయడం నచ్చదని సునీల్ శెట్టి అన్నారు. అయితే సౌత్ హీరోలకు నార్త్ లో ఎలాంటి గుర్తింపు దక్కుతోంది? స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తనకి అక్కడ కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పడం సంచలనం రేపింది. ధనుష్, నాగార్జున వంటి వారికి గౌరవం దక్కినా, కొందరికి మాత్రం దక్కట్లేదన్న చర్చ సినిమా వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.

నార్త్ హీరోలు, సౌత్‌లో విలన్లుగా చేయడం నాకెంత మాత్రం నచ్చట్లేదని ఈ మధ్యనే అన్నారు సునీల్‌ శెట్టి. అక్కడి వారు ఇక్కడెలా ఉండాలో ఓ ఒపీనియన్‌ వ్యక్తమైనప్పుడు.. మన వాళ్లు అక్కడెలా ఉండాలి? మన వాళ్లకి అక్కడ ఎలాంటి గుర్తింపు లభిస్తోంది? రీసెంట్‌గా దుల్కర్‌ ఏమన్నారు? నార్త్ లో మన హీరోలకు దక్కుతున్న రిసెప్షన్‌ గురించి దుల్కర్‌ అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. మన దగ్గర స్టార్‌ స్టేటస్‌ ఉన్న హీరోకి, నార్త్ లో సెట్లో కనీసం కుర్చీ కూడా ఉండకపోవడం ఏంటని విస్తుపోతున్నారు. చుట్టూ మనుషులు, లగ్జరీ కార్లు లేకపోతే మన వాళ్లను నార్త్ వాళ్లు సరిగా గుర్తించరా? మానిటర్‌ దగ్గర సన్నివేశాలను చూసుకోవడానికి కూడా అవకాశం కల్పించరా? అన్నది ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న విషయం. తనకి అలాంటి అనుభవాలే ఎదురయ్యాయన్నది దుల్కర్‌ ఇచ్చిన ఓపెన్‌ స్టేట్‌మెంట్‌. సౌత్‌ నుంచి నార్త్ కి వెళ్లి సినిమాలు చేసిన వారు మన దగ్గర చాలా మందే ఉన్నారు. పృథ్విరాజ్‌ అక్కడ తరచూ ప్రాజెక్టులు చేస్తుంటారు. మరి ఆయన కూడా ఇలాగే ఫీలవుతున్నారా? ధనుష్‌నార్త్ లోనూ హీరోగా చెలరేగిపోతున్నారు. రీసెంట్‌గా తేరే ఇష్క్ మే కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మన అక్కినేని తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య కూడా నార్త్ ప్రాజెక్టులు చేశారు. అక్కడివారు అత్యంత గౌరవంగా చూసుకున్నారనే చెప్పారు. మరి మనకి దక్కుతున్న గౌరవం మలయాళ ఆర్టిస్టులకు దక్కడం లేదా? అన్న వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్.. నిజమైతే కనక.. హాలీవుడ్ షేకే అవ్వాల్సిందే

సామ్‌ రూట్లో సంయుక్త… ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా

సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్.. కెరీర్ బ్యాలన్స్ కోసం నానా కష్టాలు

Samantha: అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

Bigg Boss Telugu: బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్