నా రాజాను వదిలి ఒంటరిగా ఉండలేను.. అందుకే బిగ్ బాస్ 9ను రిజెక్ట్ చేశా…
బుల్లితెర ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ షోలో అడుగుపెట్టారు. సెలబ్రిటీల కోటాలో 9 మంది, ఆరుగురు కామనర్స్ క్యాటగిరీలో ఆరుగురు బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చారు. కామనర్స్ మెయిన్ హౌస్‌లో ఉంటుండగా, సెలబ్రిటీలు మాత్రం ఔట్ హౌస్ లో ఉన్నారు.మొత్తానికి ఓనర్స్ వెర్సస్ టెనెల్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్.
అయితే ఈ సీజన్ మొదలు అవ్వకముందే హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనేది సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. దాదాపు వారే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే మొదటి నుంచి కంటెస్టెంట్ల లిస్టులో వినిపించిన దివ్వెల మాధురి మాత్రం బిగ్ బాస్ 9 హౌస్ లోకి రాలేదు. ఈక్రమంలోనే స్వయంగా ఆమే… ఓ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్ పై క్లారిటీ ఇచ్చింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే అని చెప్పిన మాధరి.. కానీ అన్ని రోజులు తన రాజాకి దూరంగా ఉండడం ఊహిస్తేనే తనకు చాలా కష్టం అనిపించిందని చెప్పుకొచ్చింది. తాను దువ్వాడ శ్రీనివాస్‌ను విడిచి ఉండలేనంటూ.. అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఇక ఇదే విషయం పై దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇటీవల ఓ సందర్బంలో స్పందించాడు. బిగ్ బాస్ 9 టీం మాధురిని కాంటాక్ట్ అయిన విషయం నిజమే అని చెప్పిన ఆయన.. అందుకు మాధురి ఒప్పుకోలేదంటూ చెప్పాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కంపు భరించలేకపోతున్నా.. విషం ఇచ్చి చంపేయండి! జడ్జికి మొరపెట్టుకున్న స్టార్ హీరో
Teja Sajja: ఆ పెద్ద దర్శకుడు.. నన్ను వాడుకొని వదిలేశాడు..
మల్లెపూలకే లచ్చ ఫైను.. ఎయిర్ పోర్టులో హీరోయిన్ కు వింత అనుభవం
రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ
