అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?

Updated on: Mar 26, 2026 | 2:01 PM

ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ అదుర్స్ సీక్వెల్‌పై దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టతనిచ్చారు. అదుర్స్ ఒక భావోద్వేగ చిత్రమని, దాని కథ అక్కడితో ముగిసిందని ఆయన పేర్కొన్నారు. బలవంతంగా సీక్వెల్ చేస్తే మొదటి భాగం మ్యాజిక్ ఉండదని, అందుకే ఆ ప్రయత్నం చేయట్లేదని వినాయక్ తేల్చి చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉండదని స్పష్టమైంది.

కొన్ని సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఒక భావోద్వేగం. వీక్షకులకే కాదు, వాటిని తెరకెక్కించిన వారికి కూడా ఈ భావోద్వేగం ఉంటుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం కూడా అలాంటి ఒక భావోద్వేగపూరిత సినిమానే. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. తారక్ ఒకవైపు ఆధునిక శైలిలో కనిపించినా, నుదుట నామాలతో సాంప్రదాయకంగా కూడా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తల్లికి ఆయన నటించిన చిత్రాలలో అదుర్స్ అత్యంత ఇష్టమైన సినిమా అని, ఈ విషయాన్ని ఆమె దర్శకుడు వీవీ వినాయక్‌తో చెప్పి ముచ్చట పడ్డారని తెలిసింది. బ్రహ్మానందం, నయనతారతో పాటు ఈ సినిమాలో నటించిన చారి వంటి ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.అయితే, ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నపై దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టత ఇచ్చారు. అదుర్స్ కథ అక్కడితో ముగిసిపోయిందని, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!

ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ

నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు

Follow Us