సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా

Updated on: Mar 09, 2026 | 5:18 PM

వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా సరస్వతి కథ వివాదంలో చిక్కుకుంది. రచయిత సాయి మాధవ్ బుర్రా తన కథను పూర్తిగా వాడలేదని, మార్చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన వరలక్ష్మి, తమ ఇమేజ్‌కు తగ్గట్టు కథను మార్చాల్సి వచ్చిందని, అయితే మానభంగం వంటి పదాలు వాడటం తప్పు అని పేర్కొన్నారు.

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సరస్వతి సినిమా ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలన ఆరోపణలు చేశారు. తన కథతో మొదలైన సినిమా మరో కథతో ముగిసిందని, తన కథను మానభంగం చేశారని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. సాయి మాధవ్ బుర్రా వ్యాఖ్యలపై వరలక్ష్మి శరత్‌కుమార్ స్పందించారు. సినిమా విడుదల తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ, సాయి మాధవ్ అందించిన కథ స్టార్స్‌కు మాత్రమే సరిపోతుందని, తాము స్టార్స్‌ కానందున తమ ఇమేజ్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేశామని వివరించారు. అయితే, సాయి మాధవ్ మానభంగం వంటి సున్నితమైన పదాన్ని వాడటం సరికాదని వరలక్ష్మి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఒక సిట్టింగ్‌కు కూడా రాలేదని, కేవలం ఆడియో నోట్‌ ద్వారానే కథను పంపించారని ఆమె తెలిపారు. ఈ వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైన గొడవనా లేక పబ్లిసిటీ స్టంటా అనే చర్చ సాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??

పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్

వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ

ఆదర్శ సర్పంచ్‌.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!

ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ

Follow Us