రూ.1000 కోట్లతో సినిమా తీస్తా !! శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాకవుతున్న ప్రొడ్యూసర్లు

Updated on: Jul 15, 2025 | 5:27 PM

ఒకప్పుడు శంకర్ సినిమాలంటే గ్రాడియర్‌కి కేరాఫ్‌.. పర్ఫెప్ట్‌ స్క్రిప్ట్ రైటింగ్‌కు ఎగ్జాంపుల్స్‌. స్టోరీ నరేషన్‌కు మోడల్స్. అలాంటి స్టేజ్‌ నుంచి శంకర్ సినిమాలు మరీ ఇంత దారుణంగా పడిపోయాయి. ఇక రీసెంట్‌ గా రిలీజ్ అయిన సినిమాలైతే.. ఇవి శంకర్ సినిమాలేనా అని అందరూ సందేహ పడేలా చేసుకున్నాయి. శంకర్ తన సినిమాలపై మరింత పకడ్బందీగా వర్క్ చేయాలనే కామెంట్ తెచ్చుకున్నాయి.

ఇలాంటి కామెంట్స్ నడుమ శంకర్ వెయ్యి కోట్లతో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. తన నిర్ణయంతో ప్రొడ్యూసర్లు షాకయ్యేలా చేశాడు. ఆఫ్టర్ ఇండియన్, గేమ్‌ ఛేంజర్ డిజాస్టర్ టాక్… శంకర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన లైఫ్‌లో తాను బిజీ అయిపోయాడు. ఇండియన్ , గేమ్ ఛేంజర్ సినిమాల కారణంగా ప్రొడ్యూసర్ దారుణంగా నష్టపోయినా.. తన పై విపరీతమైన విమర్శల వర్షం కురిసినా.. శంకర్ మాత్రం ఇంటికే పరిమితయ్యాడు. ఓ టైంలో మీడియా ముందుకు వచ్చినా.. ఇండియన్, గేమ్ ఛేంజర్ సినిమాల రిజల్ట్‌కు.. తనకు సంబంధం లేదన్నట్టే మాట్లాడాడు. ఫెయిల్యూర్‌కు బాధ్యతను వహించకుండా.. అది ప్రొడ్యూసర్లపైకే నెట్టేశాడు. దీంతో ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్లు ఒకింత ఫీలైనట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అంతేకాదు ఇలా అయితే భవిష్యత్తులో ఏ ప్రొడ్యూసర్ శంకర్ తో సినిమా చేయడనే టాక్ కూడా వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి సైలెంట్ మెయిన్ టేన్ చేస్తూ వస్తున్న శంకర్.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. రోబో సినిమా తర్వాత తనకు మరో డ్రీమ్ ఉందని.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో… వెల్పరి నవలను తాను వెయ్యి కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నట్లు చెప్పాడు. వెల్పరి ప్రాజెక్ట్‌ తమిళ సినిమాతో పాటు భారతీయ సినిమాకు గర్వకారణంగా మారే అవకాశం ఉందన్నాడు. అయితే శంకర్ అనౌన్స్ చేయడమే ఆలస్యం కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈ స్టార్ డైరెక్టర్‌కు దూరంగా వెళుతున్నారట. ఈ టైంలో శంకర్ తో సినిమా చేసి.. రిస్క్ చేయలేం అంటూ బాహాటంగానే చెబుతున్నాట. శంకర్ తమను అప్రొచ్ అవకముందే ఆయన టీంకు హింట్ ఇస్తున్నారట. మరి ఇలాంటి సిట్యుయేషన్లో ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఎలా మొదలెడతాడో.. అసలు మొదలు పెడతాడో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నప్ప అట్టర్ ఫ్లాప్‌ అంటూ ట్రోలింగ్.. మోహన్ బాబు రియాక్షన్