Adipurush: ఇంత చేసినా ట్రోల్స్ ఆగకపోవడంతో.. డైరెక్టర్ సీరియస్ నోట్

Updated on: Oct 11, 2022 | 9:53 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందిస్తూ.. అయోధ్యలోని సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏ను ఈ టీజర్ నిరాశపరిచిందనే చెప్పుకొవాలి. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఎఎఫ్ఎక్స్ ఎక్కువైందని.. టీజర్ అస్సలు బాలేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ విశ్లేషకులు సైతం టీజర్ పై విమర్శలు చేశారు. ఈ మూవీ టీజర్ పై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు డైరెక్టర్ ఓంరౌత్. సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్ బ్యాక్ గమనించానని.. ప్రజలు ఊహించినట్టుగానే సినిమా ఉండబోతుందని.. మాపై నమ్మకం ఉంచాలని కోరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: నయనతారకు కవలలు పుడతారని NTR ఎప్పుడో చెప్పారు..

ఇండియాను షేక్ చేస్తున్న కాంతారా.. న్యూ కాన్సెప్ట్‌ .. మైండ్‌ బ్లోయింగ్

ఆ పాము తెలివికి నెటిజ‌న్లు ఫిదా.. వీడియో వైర‌ల్

గొప్ప మనసున్న డాక్టరమ్మ.. తాను చదివిన కాలేజీకి రూ.20కోట్ల విరాళం !!

వామ్మో.. రైల్లో సీటు కోసం ఇంతలా కొట్టుకోవాలా ?? రచ్చ రచ్చ చేశారుగా !!

 

Published on: Oct 11, 2022 09:53 AM