Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

Updated on: Mar 01, 2026 | 6:54 PM

శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' సినిమా ఫిబ్రవరి 27న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, రిలీజ్‌కు ముందే సినిమా లీక్ అవ్వడం, బ్లాక్‌మెయిల్ బెదిరింపులు ఎదురవ్వడంపై శ్రీ విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్‌లోనే లీక్ అయిన సినిమా షూటింగ్‌ను 20 రోజుల నుంచి 7 రోజుల్లో పూర్తి చేయాల్సి వచ్చిందని, అందుకే సరైన ప్రమోషన్లు లేకుండానే హడావిడిగా విడుదల చేశామని తెలిపారు. ఈ కష్టాలను దాటి సినిమాను విజయవంతం చేశామన్నారు.

విష్ణు విన్యాసం సినిమాతో ఈ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు. మరోసారి తన పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లో అందర్నీ నవ్విస్తున్నాడు. తన మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌ను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించేశాడు. ఈ క్రమంలోనే ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో రిలీజ్‌కు ముందే తన సినిమాను లీక్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. విష్ణు విన్యాసం సినిమాను హడావిడిగా రిలీజ్ చేయటం వెనుక రీజన్ ఏంటో రివీల్ చేశారు హీరో శ్రీ విష్ణు. షూటింగ్ సమయంలోనే తమ సినిమా లీక్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమాను డిసెంబర్‌లోనే లీక్ చేసారని.. అప్పటికి షూటింగ్ ఇంకా నడుస్తోందని చెప్పుకొచ్చాడు విష్ణు. అలా సినిమా లీక్ అవ్వటంతో యూనిట్ అంతా కంగారు పడిందన్నాడు విష్ణు. అంతేకాదు తన ప్రొడ్యూసర్ కు కాల్ చేసిన లీకర్స్.. డబ్బులు డిమాండ్ చేశారని విష్ణు చెప్పుకొచ్చాడు. అయినా కానీ తామందరం ధైర్యంగా ఉన్నామని.. పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చి.. 20 రోజులు చేయాల్సిన షూట్‌ను 7 రోజుల్లో రాత్రింబవళ్లు కష్టపడి పూర్తి చేశామన్నాడు. సరైన ప్రమోషన్ కూడా లేకుండానే సినిమా విడుదల చేయడానికి కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే

Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం

భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం

Follow Us