Deepika Padukone: ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!’

Updated on: Sep 20, 2025 | 12:42 PM

కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకుందా? లేక తప్పించారా? అనే చర్చ ఓ వైపు నడుస్తుండగానే.. ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నుంచి వచ్చిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. దీపిక వైపే అందరూ వేలెత్తి చేసేలా.. చూపించేలా చేస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కల్కి 2898AD.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది.

అందులోనూ సుమతి క్యారెక్టర్ చేసిన దీపికకు మంచి అప్లాజెస్‌ను తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ పార్ట్‌ 2 లోకూడా దీపిక క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉందనే విషయం తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్ మొదలవుతుందనే న్యూస్ వస్తున్న నేపథ్యంలోనే దీపిక తమ సినిమా నుంచి తప్పించినట్టు ఓ న్యూస్ అఫిషియల్‌గా బయటికి వచ్చింది. కల్కి 2989AD ఫస్ట్ పార్ట్‌లో దీపికాతో సుదీర్ఘమైన ప్రయాణం చేసినప్పటికీ.. దాని స్వీకెల్‌లో ..దీపికా నటించరని వైజయంతీ మూవీస్ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే.. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్‌ మీ ముందుకు వస్తుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇక్కడి వరకు బానే ఉన్నా.. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలో సంచలనంగా మారింది. ‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు నాగ్‌ అశ్విన్‌. అందులో ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..’ అని అశ్వ‌త్థామకు కృష్ణుడు చెప్పే డైలాగు ఉంది. దీన్ని షేర్‌ చేస్తూ ఆయన ఓ ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టారు. ‘జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ టాలెంటెడ్‌ దర్శకుడు దీపికను ఉద్దేశించే పోస్ట్‌ పెట్టారని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…

Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..

థార్‌ కారులో ఫుడ్‌ డెలివరీ.. షాకైన కస్టమర్‌

వీధి కుక్కలపై వింత నిర్ణయం రెండు సార్లు కరిస్తే.. జీవిత ఖైదే