డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్టీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలపై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు. వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలతో తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందని సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలుగా తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Gold Price Today: మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా
Mohammed Kaif: వాళ్లిద్దరూ లేకుండా కప్ గెలవలేం
