‘సూపర్ హిట్‌’ డిప్యూటీ సీఎం సినిమాపై.. సీఎం సాబ్‌ వైరల్ ట్వీట్‌!

Updated on: Jul 25, 2025 | 11:54 AM

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23 రాత్రి నుంచే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడగా, ఉదయం నుంచి రెగ్యులర్ షోస్ కూడా పడ్డాయి. ఈ క్రమంలోనే పవన్ సినిమాపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్‌ ట్వీట్ చేశారు.

డిప్యూటీ సీఎం సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్‌ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు. మిత్రుడు పవన్ కల్యాణ్‌ కథానాయకుడిగా చరిత్రాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అంటూ చంద్రబాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక అంతకు ముందు మంత్రి నారా లోకేష్ పవన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. హరి హర వీరమల్లు సినిమా భారీ విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. మా పవన్ అన్న సినిమా హరి హర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు నారా లోకేష్‌. అంతేకాదు పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ తన పోస్టులో కోట్ చేశారు ఈయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరీ ఇంత ఏడుపుగొట్టు సినిమానా ఇది! చూసిన వాళ్లందరూ పడీ పడీ ఏడుస్తున్నారుగా

ఆ గ్రామంలో చింత చెట్టే డాక్టర్! చెట్టు కాండం గుండా వెళితే రోగాలు మాయం!