లోకేష్ యూనివర్స్.. ఇక లేనట్టేనా?
"సినిమాటిక్ యూనివర్స్" ట్రెండ్ ఇప్పుడు నెమ్మదిస్తోంది. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచిన ఈ ఫార్ములాను మేకర్స్ పక్కన పెడుతున్నారు. లోకేష్ కనగరాజ్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్, టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మ, శైలేష్ వంటి దర్శకులు ఇప్పుడు స్టాండ్‌లోన్ చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. యూనివర్స్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
వెండితెరపై ట్రెండ్‌లు మారడం సర్వసాధారణం. అయితే, ఇటీవల కాలంలో అత్యంత విజయవంతమైన “సినిమాటిక్ యూనివర్స్” ఫార్ములా ఇప్పుడు సడెన్‌గా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్ స్టార్స్‌ను భాగం చేసుకుని విజయాలు సాధించిన ఈ ట్రెండ్ ప్రస్తుతం వెనుకబడిపోయింది. మేకర్స్ యూనివర్స్‌లను పక్కన పెట్టి, స్టాండ్‌లోన్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో ముందుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు చెప్పుకోవచ్చు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య వంటి స్టార్స్‌ను భాగం చేశారు. అయితే, ఇప్పుడు లోకేష్ ఈ యూనివర్స్‌ను పక్కన పెట్టి స్టాండ్‌లోన్ చిత్రాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కూడా కష్టాల్లో ఉంది. పఠాన్ విజయం తర్వాత వచ్చిన టైగర్ 3 డిజాస్టర్ కావడంతో, వైఆర్ఎఫ్ టీమ్ ఈ యూనివర్స్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. ప్రకటించిన టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాను కూడా నిలిపివేశారు.
మరిన్ని వీడియోల కోసం :
