టీజర్‌ను చూసి కన్ఫూజన్‌లో ఫ్యాన్స్?

Updated on: Aug 23, 2025 | 12:07 PM

చిరు బర్త్‌ డే అంటే.. మెగా ఫ్యాన్స్‌కి పండగ డే! అలాంటి డే రోజు.. తమ బాస్‌ నుంచి డబుల్ బొనాంజా అందుకున్నారు ఫ్యాన్స్. చిరు బర్త్‌ డేకు ముందు రోజే.. విశ్వంభర టీజర్‌తో వేరే లెవల్ ఎక్స్‌పీరియన్స్‌ను రుచి చూసిన మెగా ఫ్యాన్స్‌.. చిరు బర్త్‌ డే రోజు రిలీజ్ అయ్యే మన శంకరప్రసాద్‌ గారు.. టీజర్ గురించే మాట్లాడుకోవడం షురూ చేశారు.

ఈ క్రమంలోనే రిలీజ్ అయిన మెగా 157 టీజర్‌.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను కన్ఫూజన్లో పడేసిందట. అనిల్ రాపూడి డైరెక్షన్లో మెగా స్టార్ చిరు హీరోగా 157 వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోందని తెలిసింది మొదలు.. ఈసినిమా గురించే అందరూ ఆరా తీస్తూ వచ్చారు. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్‌.. చూసి బాస్‌కు మరో బంపర్ హిట్ గ్యారెంటీ అనే అనుకున్నారు. మధ్య మధ్యలో సెట్‌ నుంచి లీకయ్యే చిరు ఫోటోలను చూసి.. అనిల్ చిరు మార్క్‌ కమర్షియల్ సినిమానే వండుతున్నాడని సంబరపడ్డారు. బాస్ లుక్‌ చూసి మురిసిపోయారు. అక్కడక్కడ ఆర్టికల్స్‌లో చిరు ఓ స్కూల్లో పీటీ సార్‌గా చేస్తున్నారని.. ఓ పాప చుట్టూ కథ తిరుగుతుందని చదివి.. సినిమా పసివాడి ప్రాణం రేంజ్లో ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే మెగా 157 గ్లింప్స్‌ బయటికి వచ్చింది. బాస్‌ లుక్కు… బీమ్స్‌ మ్యూజిక్… అనిల్ టేకింగ్‌ అందర్నీ స్టన్ అయ్యేలా చేసింది. అందర్నీ ఆకట్టుకుంటోంది. కానీ మన శంకరప్రసాద్‌గారు టైటిల్ గ్లింప్స్‌లో చిరు గెటప్ అండ్ సెటప్ చేస్తూంటే.. సెక్యూరిటీ ఆఫీసర్‌ అన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. ఇంతకీ మెగాస్టార్ ఫిజిలక్ టీచరా లేదా… సెక్యూరిటీ ఆఫీసరా? అన్న డౌట్‌ వారిని ఆలోచింపజేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మామయ్యకు.. బన్నీ క్రేజీగా బర్త్‌డే విషెస్!

NTR సినిమా 15కోట్ల సెట్టా.. ఆ పైసలతో ఇంకో సినిమానే చేసేయొచ్చుగా…

‘నా అన్న ధ్రువతార, పితృసమానుడు’ పవన్‌ ఎమోషనల్ ట్వీట్

సినిమాలపై సమంత కీలక నిర్ణయం..! ఇదేదో ఎప్పుడో చేస్తే అయిపోయేదిగా..