నా అత్తమ్మ తన కళ్లను దానం చేసింది.. ఫోటోలతో సహా.. చూపించిన చిరు

Updated on: Sep 01, 2025 | 5:11 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూశారు. గ‌త కొన్నాళ్లుగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె ఆగస్టు 30న తుదిశ్వాస విడిచారు. దీంతో మెగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే మెగా హీరోలందరూ అల్లు కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు.ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇక చిరంజీవి ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అన్ని పనులు చూసుకున్నారు. అత్తమ్మ పాడె కూడా మోసి తుది వీడ్కోలు పలికారు. అయితే కనక రత్నమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సాయంత్రం ఓ హాస్పిటల్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అత్తమ్మ చేసిన ఓ గొప్ప పని గురించి అందరితో పంచుకున్నారు. ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మా అత్తగారు లేరు అనే వార్త వచ్చిందని చెప్పిన చిరంజీవి.. ఆ టైంలో అల్లు అరవింద్ హైద్రాబాద్‌లో లేరని బెంగుళూరులో ఉన్నారన్నారు.దాంతో తాను వెంటనే అల్లు ఇంటికి వెళ్లానని.. ఆ సమయంలో గతంలో తాము అనుకున్న ఆర్గాన్ డొనేషన్ విషయం గుర్తుకు వచ్చిందని చెప్పారు చిరు. డొనోషన్ విషయం గుర్తుకు రాగానే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ అర్ధరాత్రి సమయంలో తమ బ్లడ్ బ్యాంక్ స్వామి నాయుడుకి ఫోన్ చేసి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టెక్నిషియన్స్‌ని కనుక్కోమన్నాని చెప్పానన్నారు చిరు. ఈ లోపు తాను అరవింద్ కు ఫోన్ చేశానని.. అత్తమ్మ, తన అమ్మ మధ్య ఒక సారి ఇదే విషయంపై చర్చ జరిగిందని.. ఇద్దరూ డొనేట్ చేస్తామని గతంలో తనకు చెప్పినట్టు అల్లు అరవింద్‌కు వివరించా అని చెప్పారు చిరు. అయితే అవయవదానం గురించి తన అత్తమ్మ ఎక్కడా సంతకం పెట్టలేదు కానీ తనకు ఆ రోజు ఆమె చెప్పిన ఆ మాటే ప్రతిజ్ఞ లాగా అనిపించిందన్నారు చిరు. ఇదే విషయం వివరించగానే అరవింద్ కూడా ఓకే అనడంతో… ఆమె కళ్లను తీసి ఆస్పత్రికి పంపించాం మంటూ చెప్పారు చిరు. అతేకాదు ఇందుకు సంబంధించిన ఫోటోలను… తన ఫోన్‌లో తీసుకున్నానంటూ.. ఆ ఫోటోలను మీడియాకు చూపించారు చిరు. దీంతో చిరు చొరవను.. అందరూ మెచ్చుకుంటూనే.. కనకరత్నమ్మ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు అందరూ. అవయవదానం గురించి మరో సారి మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగమైన అమృతసర్‌‌‌ను ఆదుకున్న వాహనం

Update Aadhaar: ఆధార్‌ అప్‌డేట్‌పై యూఐడీఏఐ కీలక సూచనలు

Megastar Chiranjeevi: అభిమానికి మెగాస్టార్‌ భరోసా!

ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి

Vijayashanti: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు