Champion Review: కొంచెం స్లో అయినా.. మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్

Updated on: Dec 27, 2025 | 2:52 PM

ఛాంపియన్ సినిమా నెమ్మదిగా మొదలైనా, కంటెంట్, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. బైరాన్‌పల్లి సాయుధ పోరాటం నేపథ్యం, ఫుట్‌బాల్ ఆటగాడు మైఖేల్ కథ ఆకట్టుకుంటాయి. పీరియాడిక్ వాతావరణం, రోషన్ నటన అద్భుతం. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్స్. చరిత్ర, పోరాటం, భావోద్వేగాల మిశ్రమం ఈ సినిమాను విజయపథంలో నిలిపింది.

కొన్ని సినిమాలు కాస్త నెమ్మదిగా మొదలై.. ఆ తరవాత పరిగెడతాయి.. ప్రేక్షకులని తమ ప్రపంచంలోకి లాగేస్తాయి.. ఛాంపియన్ అలాంటి సినిమానే . ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ టాక్ తెచ్చుకుంది. అయితే కొంచెం స్లో అనిపించిన సందర్భాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద.. కంటెంట్‌ అండ్ ఎమోషన్‌! ఈ రెండింటి కారణం ఈ సినిమా గెలిచిందనే అభిప్రాయం సగటు ప్రేక్షకుల నుంచి బలంగా వినిపిస్తోంది. బైరాన్‌పల్లి సాయుధ పోరాటం నేపథ్యాన్ని, ఫుట్‌బాల్ ఆటగాడు మైఖేల్ సి విలియమ్స్ కథతో ముడిపెట్టి రూపొందించిన ఈ ఫిక్షనల్ స్టోరీ ఆసక్తికరంగా మొదలవుతుంది. పీరియాడిక్ వాతావరణాన్ని దర్శకుడు చాలా శ్రద్ధగా, నిజాయితీగా తీర్చిదిద్దాడు. కథలో అవసరమైనంత డ్రామా, భావోద్వేగం చాలా బ్యాలెన్స్‌డ్‌ గా కనిపిస్తాయి. మైఖేల్ అలియాస్ రోషన్ ఫుట్‌బాల్ ఛాంపియన్ ట్రాక్ కూడా కథలో కీలకంగా నిలుస్తుంది. హీరో బైరాన్‌పల్లిలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించినా, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో కథ ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్ లోకి వెళ్తుంది . అక్కడి నుంచి సినిమా గ్రిప్ మరింత బలపడుతుంది. అయితే సెకండ్ హాఫ్లో తెలంగాణ సాయుధ పోరాటం, వారి లక్ష్యాన్ని చూపించిన తీరు ఇంట్రెస్టింగ్‌గా నిజాయితీగా అనిపిస్తుంది. ప్రీ–ఇంటర్వెల్‌లో రోషన్ ఫుట్‌బాల్ ఆడే సన్నివేశం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. అదైతే సినిమాకి హైలెట్. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే…బైరాన్‌పల్లి పోరాటాన్ని దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తుంది. గ్రాండ్ స్కేల్, ఎమోషనల్ ఇంటెన్సిటీ కలిసి క్లైమాక్స్‌ను సినిమాకి హార్ట్‌గా నిలబెట్టాయి. రోషన్ ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. మైఖేల్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్, చరిత్ర, పోరాటం ఇవన్నీ బలంగా ఉన్నాయి కనుకే.. ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Esha Review: కథ లేదు.. కానీ భయం ఉంది! ఈషా రివ్యూ