గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. పోలీస్‌ స్టేషన్లో కేసు

|

Jan 14, 2025 | 3:34 PM

కోట్లకు కోట్లు ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో.. మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా.. రిలీజ్‌ రోజే నెట్టింట లీక్ అవడం ఏంటి? అగకుండా ఆ లింక్ సోషల్ మీడియాలో షేర్ అవ్వడం ఏంటి? అయితే ఇలా జరగడానికి కారణం కొందురు గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్రకు ప్లాన్ చేయడమే అంటున్నారు మేకర్స్.

దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందంటూ సాక్ష్యాలతో సహా సైబర్ క్రైమ్‌ పోలీసులను కలిశారు. మరి ఈ కేసును టేకప్ చేసిన పోలీసులు.. త్వరలో ఎలాంటి నిజాలతో బయటికి వస్తారో చూడాలి. బాలయ్య మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గా.. సంక్రాంతి కానుకగా రిలీజ్‌అయిన డాకు మహారాజ్‌ బాక్సాఫీస్‌ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. డే1 దిమ్మతిరిగే రేంజ్లో వరల్డ్ వైడ్ ఏకంగా 56 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు గేర్‌ మార్చేసింది. రోజు రోజుకూ ఈ మూవీపై పాజిటివ్ బజ్ పెరుగుతుండడంతో.. కలెక్షన్స్‌లో 100 క్రోర్ మార్క్‌కు డాకు రీచ్‌ అవ్వడం పక్కా అనే కామెంట్ ఫిల్మ్ అనలిస్టుల నుంచి వస్తోంది. ఇక ఇది నిజమయ్యేట్టు.. డే బై డే కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది బాలయ్య మూవీ. కుమ్మేయడమే కాదు 100 కోట్ల మైలు స్టోన్ వైపు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!

ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి

అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..