‘డాక్యుమెంటరీనే కాదు డబల్ హెడేక్’ చిక్కుల్లోకి నయన్.. హైకోర్టుకు కొత్త నోటీసులు
హీరోయిన్ నయనతార చిక్కుల్లో పడింది. తన డాక్యుమెంటరీ నయనతార : బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ డాక్యుమెంటరీలో నిర్మాతల అనుమతి లేకుండానే చంద్రముఖి సినిమా క్లిప్ వినియోగించడంపై హైకోర్టును ఆశ్రయించారు ఆ మూవీ మేకర్స్.
దీంతో ఈ విషయంపై నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇక నయన్ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీని డార్క్ స్టూడియో నిర్మించింది. ఇది 2024 నవంబర్ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి కాపీ కంటెంట్ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది ఈ డాక్యుమెంటరీ. మొదట హీరో ధనుష్ ఈ డాక్యుమెంటరీ పై మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తాను ప్రొడ్యూస్ చేసిన నానుమ్ రౌడీథాన్ సినిమా నుంచి అనుమతి లేకుండా ఈ చిత్రంలోని ఫుటేజ్‌లను ఉపయోగించారని అభ్యంతరం వ్యక్తం చేశాడు ధనుస్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ క్రమంలోనే చంద్రముఖి మేకర్స్ కూడా కాపీరైట్ పిటిషన్ వేశారు ఈ డాక్యుమెంటరీ పై.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న జీతంతో సంతోషంగా బతికా.. ఇప్పుడు లక్షల జీతంతో నరకం చూస్తున్నా
పెళ్లిళ్లు ఆపేసిన మేకలు, గొర్రెలు.. కారణం ఇదే
Nepal: నెపో కిడ్ ఉద్యమం వెనుక ఆ వ్యక్తి
మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. కాపాడండి ప్లీజ్.. నేపాల్ లో భారత మహిళ ఆవేదన
Robbery: రూ. 4 కోట్ల లగ్జరీ కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ
